Lalan Singh : ఓబీసీ హోదాను తారు మారు చేసిన మోదీ
మోదీ మోస్ట్ డేంజరస్ లీడర్ అంటూ ఫైర్
Lalan Singh : ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైన నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు జేడీయూ పార్టీ చీఫ్ లాలన్ సింగ్. ఆయన పీఎంపై నిప్పులు చెరిగారు. ఓబీసీ హోదాను తారు మారు చేసిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. పాట్నాలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో లాలన్ సింగ్(Lalan Singh) ఈ కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది.
నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో తన కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని కానీ దానిని దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయం వచ్చేసరికల్లా తాను వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తినంటూ ప్రజలకు మాయమాటలు చెబుతారంటూ ధ్వజమెత్తారు.
అసలు గుజరాత్ లో ఈబీసీ కేటగిరీ లేక పోయినప్పటికీ ప్రధాని 2014లో అత్యంత వెనుకబడిన వర్గానికి చెందిన వాడినంటూ దేశ వ్యాప్తంగా తిరిగారని మండిపడ్డారు లాలన్ సింగ్. గుజరాత్ లో ఇబిసీ లేదు కేవలం ఓబీసీ మాత్రమే ఉందన్నారు. మోదీ ఓబీసికి చెందిన వ్యక్తి కాదు. ఆయన డూప్లికేట్ ఒరిజనల్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు లాలన్ సింగ్(Lalan Singh).
ఇదిలా ఉండగా బీజేపీ ఓబీసీ మోర్చా నేత, అధికార ప్రతినిధి నిఖిల్ ఆనంద్ మండిపడ్డారు. లాలన్ సింగ్ కు నైతిక రాజకీయ స్వభం లేదన్నారు. లాలన్ సింగ్, నితీశ్ కుమార్ ప్రధాని మోదీపై(PM Modi) పరుష పదజాలాన్ని వాడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. తాజా కామెంట్స్ తో బీహార్ లో జేడీయూ, బీజేపీ మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది.
Also Read : ప్రపంచం తిరోగమనం భారత్ పురోగమనం