PM Modi : న్యాయ వ్యవస్థలో సంస్కరణలు అవసరం
అండర్ ట్రయల్స్ పై మోదీ కామెంట్స్
PM Modi : భారత దేశ న్యాయ వ్యవస్థలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇదే సమయంలో జైళ్లల్లో మగ్గుతున్న ఖైదీల పట్ల (అండర్ ట్రయల్స్ ) సానుభూతితో వ్యవహరించాలని సూచించారు. శనివారం జరిగిన అఖిల భారత న్యాయ మంత్రుల సదస్సులో ప్రధానమంత్రి మోదీ(PM Modi) పాల్గొని ప్రసంగించారు.
జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగు పర్చేందుకు గాను గత ఎనిమిది సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం 32,000 ఫిర్యాదులను తొలగించిందని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలలో ఇప్పటికీ వలస రాజ్యాల కాలం నాటి చట్టాలు ఉన్నాయని అన్నారు మోదీ.
వాడుకలో లేని చట్టాలు, వేగవంతమైన విచారణలను తొలగించేందుకు గాను న్యాయ వ్యవస్థలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు
ప్రధానమంత్రి. నిరంతర సంస్కరణలు ఉండాలన్నారు. అనవసరమైన చట్టాలను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పారు. చాలా చట్టాలు పనికి రాకుండా పోయాయి. వాటి వల్ల ఉపయోగం లేదు. సత్వర న్యాయం అందాలంటే ముందు వీటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు మోదీ(PM Modi).
దీనిపై సమీక్షించాలని సూచించారు. న్యాయం మరింత సౌలభ్యం ఉండేలా చూడాలని కోరారు. న్యాయం ఆలస్యం అనేది సవాళ్లలో ఒకటి. ఈ సమస్యను తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు ప్రధానమంత్రి. చట్టాలను రూపొందించేటప్పుడు సాధారణ భాషపై దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు మోదీ.
దీని వల్ల ప్రజలు చట్టాలను అర్థం చేసుకుంటారని అన్నారు. స్థానిక భాష ప్రాముఖ్యతను ప్రస్తావించారు. కొన్ని దేశాలు కూడా ఈ నిబంధనను కలిగి ఉన్నాయని గుర్తు చేశారు మోదీ.
Also Read : ప్రపంచం తిరోగమనం భారత్ పురోగమనం
Addressing the inaugural session of All India Conference of Law Ministers and Secretaries. https://t.co/sWk3fhHIIm
— Narendra Modi (@narendramodi) October 15, 2022