Aadhaar New Born : దేశమంతటా శిశువులకు ఆధార్ కార్డులు
స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వం
Aadhaar New Born : కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డు గురించి అప్ డేట్ ఇచ్చింది. త్వరలో అన్ని రాష్ట్రాలలో జనన ధ్రువీకరణ పత్రాలతో పాటు నవ జాత శిశువుల (అప్పుడే పుట్టిన పిల్లలు) కు కూడా ఆధార్ కార్డులు(Aadhaar New Born) జారీ చేయాలని నిర్ణయించింది. ఇప్పటి వరకు దేశంలో 16 రాష్ట్రాలు ఆధార్ లింక్డ్ బర్త్ రిజిస్ట్రేషన్లు కలిగి ఉన్నాయి.
ఈ ప్రక్రియ ఈ ఏడాది ప్రారంభమైంది. కాల క్రమేణా మిగతా రాష్ట్రాలు వాటిని అనుసంధానం చేస్తూ వచ్చాయి. మిగిలిన రాష్ట్రాలలో కూడా ఈ ఆధార్ జారీ చేసే ప్రక్రియ వేగవంతం కానుంది.
ఆధార్ నంబర్లను జారీ చేసే ప్రభుత్వ ఏజెన్సీ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యుఐడీఏఐ) రాబోయే కొద్ది నెలల్లో అన్ని రాష్ట్రాలు కొత్త పేరెంట్స్ కు అదనపు సౌకర్యాన్ని అందించే పనిలో ఉంటాయని భావిస్తున్నారు.
5 ఏళ్ల లోపు పిల్లలకు, బయో మెట్రిక్ లు తీసుకోరు. వారి పేరెంట్స్ యుఐడితో లింక్ చేయబడిన జనాభా సమాచారం , ముఖ ఛాయాచిత్రం ఆధారంగా ప్రాసెస్ చేస్తారు. అందు వల్ల బిడ్డకు 5, 15 ఏళ్లు నిండాక బయో మెట్రిక్ అప్ డేట్ అవసరం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆధార్ కార్డు అత్యవసరంగా మారింది.
లబ్దిదారుల గుర్తింపు, ప్రామాణీకరణ, ప్రయోజనాల బదిలీ , డి డూప్లికేషన్ ను నిర్ధారించేందుకు ఆధార్ అత్యంత ముఖ్యం. 650 రాష్ట్రాలు అమలు చేస్తున్న పథకాలు, 315 కేంద్ర ప్రభుత్వం అమలవుతున్న పథకాలు లబ్ది పొందాలంటే ఆధార్ కార్డులు ఉండాల్సిందే.
Also Read : దేశంలో 2,430 కరోనా కేసులు