Taiwan China : చైనా ఆధిపత్యాన్ని ఒప్పుకోం – తైవాన్
మరోసారి స్పష్టం చేసిన వైనం
Taiwan China : చైనా దేశ అధ్యక్షుడు జిన్ పింగ్ ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఏదో ఒకరు చైనాలో తైవాన్(Taiwan China) కలిసి పోతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఆదివారం జరిగిన కీలక సమావేశంలో జిన్ పింగ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. చైనా ముందున్న సవాల్ ఒక్కటే.
ఇప్పటికీ అన్నింటినీ చేరుకున్నామని తాను భావిస్తున్నానని కానీ ఒక్కటే మిగిలిందని, అది కేవలం తైవాన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. దీనిపై తైవాన్ సీరియస్ గా స్పందించింది. తమపై ఆర్థిక ఆంక్షలు విధించినంత మాత్రాన తాము లొంగి పోయే ప్రసక్తి లేదని పేర్కొంది ఆ దేశం. ముందు హాంకాంగ్ లో అల్లర్లు జరగకుండా చూసుకుంటే చైనాకు బెటర్ అని సూచించింది.
తాము స్వయం ప్రతిపత్తి కలిగిన దేశమని ఇందులో ఇంకొకరి జోక్యాన్నితాము సహించ బోమంటూ స్పష్టం చేసింది. అవసరమైతే ప్రాణాలను పోగొట్టుకుంటామని కానీ గజం జాగాను వదులుకునేందుకు సిద్దంగా లేమని హెచ్చరించింది. ఇదిలా ఉండగా ఓ వైపు చైనా మిస్సైళ్లను మోహరించింది.
ఇంకో వైపు అమెరికా తైవాన్ కు వత్తాసు పలుకుతోంది. ఇదిలా ఉండగా సైనిక చర్య పేరుతో రష్యా ఉక్రెయిన్ ను సర్వ నాశనం చేసే పనిలో పడింది. ఈ తరుణంలో రష్యాకు మద్దతు పలుకుతోంది చైనా. దీనిని దృష్టిలో పెట్టుకుని తైవాన్ ను ఎలాగైనా తన దారిలోకి తెచ్చు కోవాలని ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే జిన్ పింగ్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read : ఇక మిగిలింది తైవాన్ ఒక్కటే – జిన్ పింగ్