Boora Narsaiah Goud : మంత్రుల కంటే కావలికార్లు బెటర్
తెలంగాణలో మంత్రుల పరిస్థితి ఘోరం
Boora Narsaiah Goud : టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారారు. మూడు పేజీల లేఖను సీఎం కేసీఆర్ కు సంధించారు. అభిమానం వేరు ఆత్మాభిమానం వేరు. కానీ బానిసత్వం అత్యంత ప్రమాదకరమైనదని పేర్కొన్నారు.
తాను రాజీనామా చేశాక చాలా మంది టీఆర్ఎస్ కు చెందిన ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు తనతో టచ్ లోకి వచ్చారని చెప్పారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో బీజేపీ నేతలను కలుసుకున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్ కు వచ్చిన సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆదివారం బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) మీడియాతో మాట్లాడారు.
ఆయన మంత్రులపై సంచలన ఆరోపణలు చేశారు. వాళ్లు కార్పొరేటర్లకు ఎక్కువ కావలికార్లకు తక్కువ అన్నారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. అన్ని వర్గాలకు చెందిన వారు కేసీఆర్ ముందు కావలి కారుల కంటే హీనంగా ఉంటారని అన్నారు. స్వేచ్ఛ లేని జీవితం , పదవి ఉన్నా ఒక్కటే లేకున్నా ఒక్కటేనన్నారు.
2009 నుండి తాను తెలంగాణ ఉద్యమకారుడిగా పని చేస్తూ వచ్చానని చెప్పారు. తన రాజకీయ కెరీర్ కు అవకాశం ఇచ్చింది కేసీఆర్ అని, అందుకే ఆయనంటే గౌరవం ఉందన్నారు. ఇవాళ తిరుపతి వెంకటేశ్వరుడిని దర్శించు కోవడం సులభమని కానీ కేసీఆర్ ను కలవాలంటే మరో తెలంగాణ పోరాటం చేయాల్సినంత పని అవుతోందన్నారు బూర నర్సయ్య గౌడ్.
పార్టీలో బానిసలకే భవిష్యత్తు ఉందని మా లాంటి ఉద్యమకారులకు లేదన్నారు. తాను ఏనాడూ పైరవీలు చేయలేదన్నారు.
Also Read : తెలంగాణకు రాని వందే భారత్ రైలు