Manish Sisodia : అరెస్ట్ అయ్యేందుకు సిద్ధం – సిసోడియా
తనకు సీబీఐ సమన్లపై డిప్యూటీ సీఎం
Manish Sisodia : ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ మద్యం స్కాంలో అభియోగాలు ఎదుర్కొంటున్న మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇవాళ విచారణకు హాజరు కావాలంటూ సమన్లలో పేర్కొంది. గుజరాత్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతోందన్నారు.
దీనిని తట్టుకోలేక ఏం చేయాలో పాలుపోక తనను ఇరికించేందుకు కేంద్రం కుట్ర పన్నిందని ఆరోపించారు సిసోడియా. సోమవారం మనీష్ సిసోడియా మీడియాతో మాట్లాడారు. తాను అరెస్ట్ అయ్యేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు. గుజరాత్ లో తాను పర్యటించకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆరోపించారు.
మోదీ త్రయం (మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా) కుట్రలో భాగంగా తనను బలి చేసేందుకు ప్లాన్ చేశారంటూ మండిపడ్డారు. వెళ్లకుండా ఆపడమే వారి ఉద్దేశమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని నకిలీ (ఫేక్ ) కేసుగా అభివర్ణించారు డిప్యూటీ సీఎం(Manish Sisodia). రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రచారం కోసం నేను గుజరాత్ కు వెళ్లాల్సి ఉంది.
కానీ వెళ్లకుండా ఉండేందుకే భారీ కుట్ర పన్నారని అన్నారు. పదే పదే మద్యం పాలసీ అంటున్నారు. 14 గంటల పాటు సీబీఐ సోదాలు చేపట్టిందని కానీ ఒక్కటి కూడా దొరకలేదన్నారు సిసోడియా. ఫోన్ తో పాటు కంప్యూటర్లు తీసుకు వెళ్లారని కానీ ఈరోజు వరకు ఎలాంటి ఆధారం లభించ లేదని ఆరోపించారు డిప్యూటీ సీఎం.
గుజరాత్ లో బీజేపీకి ఆప్ భయం పట్టుకుందన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మోదీ కనుసన్నలలో నడుస్తున్నాయంటూ మండిపడ్డారు.
Also Read : నేడే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోలింగ్