Sikh Community Objects : షిండే కొత్త పార్టీ గుర్తుపై అభ్యంత‌రం

ఎన్నిక‌ల సంఘంపై సిక్కు వ‌ర్గాలు గ‌రం

Sikh Community Objects : మ‌రాఠా శివ‌సేన పార్టీ గుర్తు ఎవ‌రికి చెందాల‌నే దానిపై మ‌ళ్లీ వివాదం రాజుకుంది. ఇప్ప‌టికే పార్టీ నీదా నాదా అంటూ సుప్రీంకోర్టు దాకా వెళ్ల‌డం ఆ త‌ర్వాత ఎన్నిక‌ల సంఘం గుర్తులు కేటాయించ‌డం జ‌రిగింది.

తాజాగా మ‌హారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే కొత్త పార్టీకి సంబంధించి జారీ చేసిన గుర్తు ఇప్పుడు చ‌ర్చ‌నీయంశంగా మారింది. దీనిపై అభ్యంత‌రం వ్య‌క్త‌మైంది.

నాందేడ్ లోని గురుద్వారా స‌చ్ ఖండ్ బోర్డు మాజీ కార్య‌ద‌ర్శి రంజిత్ సింగ్ క‌మ్తేక‌ర్ , స్థానిక కాంగ్రెస్ నాయ‌కుడు మ‌త ప‌ర‌మైన భావాల‌ను క‌లిగి ఉన్నందున గుర్తును(Sikh Community Objects) అనుమ‌తించ వ‌ద్దంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాశారు. ఇదిలా ఉండ‌గా సీఎం ఏక్ నాథ్ షిండే పార్టీకి ఎన్నిక‌ల సంఘం రెండు క‌త్తులు, ఒక డాలు గుర్తును కేటాయించింది.

శివ సేన లోని రెండు వ‌ర్గాల‌కు కొత్త‌గా కేటాయించిన ఎన్నిక‌ల గుర్తుల‌పై వివాదాలు కొన‌సాగుతున్నాయి. ఇక సీఎం ఏక్ నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన పార్టీకి గుర్తు కేటాయించ‌డం పూర్తిగా విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు. ఇది ఖ‌ల్సా పంత్ కు సంబంధించిన మత ప‌ర‌మైన చిహ్న‌మ‌ని ఆరోపించారు.

ఇక బాలా సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివ‌సేన పార్టీకి సంబంధించి ఉద్ద‌వ్ ఠాక్రేకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం జ్వ‌లించే జ్యోతిని కేటాయించింది సీఈసీ. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేసింది స‌మ‌తా పార్టీ.

ఒక‌వేళ త‌మ ఫిర్యాదును ఎన్నిక‌ల క‌మిష‌న్ ప‌ట్టించుకోక పోతే తాము కోర్టును ఆశ్ర‌యిస్తామ‌ని చెప్పారు రంజిత్ సింగ్ కమ్తేక‌ర్ , కాంగ్రెస్ నాయ‌కుడు. త‌మ మ‌త గురువు శ్రీ గురు గ‌దోవింద్ సింగ్ ఖ‌ల్సా పంత్ మత చిహ్నంగా క‌త్తి, డాలును ఏర్పాటు చేశార‌ని పేర్కొన్నారు.

Also Read : అరెస్ట్ అయ్యేందుకు సిద్ధం – సిసోడియా

Leave A Reply

Your Email Id will not be published!