Pawan Kalyan : వైసీపీ తాటాకు చ‌ప్పుళ్ల‌కు భ‌య‌ప‌డ‌ను

జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌పై కేసులు అక్ర‌మం

Pawan Kalyan : రోజు రోజుకు వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను అవ‌లంభిస్తోంది. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఆందోళ‌న చేప‌ట్ట‌డం, నిర‌స‌న తెల‌ప‌డం, ప్ర‌శ్నించ‌డం స‌హ‌జం. దానిని అడ్డుకోవాల‌ని చూడ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. ఇది ఎన్న‌టికీ స‌మ‌ర్థ‌నీయం కాదు. దీనిని గుర్తిస్తే మంచిద‌ని సూచించారు జ‌న‌సేన పార్టీ చీఫ్ , న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్.

త‌మ కార్య‌క‌ర్త‌ల‌పై అక్ర‌మంగా కేసులు బ‌నాయించార‌ని, కొంద‌రిని ఇంకా విడుద‌ల చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. ఎవ‌రిపై దాడికి దిగ‌లేద‌న్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు పాల‌న గాడి త‌ప్పుతోంద‌ని అని చెప్పేందుకు ఈ ఘ‌ట‌న ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన్నారు. గొడ‌వలు సృష్టించింది వైసీపీ వారి ప‌నేనంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌(Pawan Kalyan).

త‌మ వారిని వ‌దిలి పెట్టేంత వ‌ర‌కు తాను న్యాయ పోరాటం చేస్తానంటూ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిల‌దీసినా, ప్ర‌శ్నించినా సీఎం జ‌గ‌న్ రెడ్డి త‌ట్టుకోలేక పోతున్నాడ‌ని, వారి మంత్రులు, అనుయాయులు జీర్ణించుకోలేక పోతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఇప్ప‌టి వ‌ర‌కు 115 మందికి పైగా జ‌న సైనికుల‌పై కేసులు పెట్టార‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 70 మందికి స్టేష‌న్ బెయిల్ తీసుకున్నామ‌ని చెప్పారు ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan). త‌మ పోరాటం ప్ర‌భుత్వంపైనే త‌ప్పా పోలీసుల‌పై కాద‌న్నారు జ‌న‌సేనాని. అమ‌ర‌వాతి రాజ‌ధాని గురించి ఎవ‌రూ మాట్లాడ కూడ‌దన్న‌దే వైసీపీ ల‌క్ష్యమ‌ని ఆరోపించారు.

వైసీపీ తాటాకు చ‌ప్పుళ్ల‌కు తాను భ‌య‌ప‌డ‌న‌ని అన్నారు. ఇక‌నైనా ప్ర‌భుత్వ ప‌నితీరు మార్చు కోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

Also Read : భ‌గ‌త్ సింగ్ తో పోలిక త‌గునా

Leave A Reply

Your Email Id will not be published!