Nitin Gadkari : ఈ ఏడాదికల్లా ఢిల్లీ.. ముంబై ఎక్స్ప్రెస్ వే
మొదటి దశ పూర్తవుతుందన్న నితిన్ గడ్కరీ
Nitin Gadkari : కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) సంచలన ప్రకటన చేశారు. ఢిల్లీ – ముంబై ఎక్స్ ప్రెస్ వే మొదటి దశ ఈ ఏడాది లోపు పూర్తవుతుందని స్పష్టం చేశారు. నారిమన్ పాయింట్ నుండి ఢిల్లీకి కేవలం 12 గంటల ప్రయాణం చేసేందుకు వీలవుతుందన్నారు.
ఢిల్లీ నుండి ముంబై లోని జేఎన్పీటీ వరకు మొదటి దశ పనులు ఈ ఏడాది లోనే పూర్తవుతాయని చెప్పారు కేంద్ర మంత్రి. రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ సాధించిన విజయాల గురించి ఏకరవు పెట్టారు. దేశంలో సుమారు కోటి మంది ప్రజలు రైకిల్ రిక్షాలు నడుపుతున్నారని తెలిసి తాను బాధ పడ్డానని అన్నారు నితిన్ గడ్కరీ.
వారిలో 80 లక్షల మంది ఇవాళ ఈ రిక్షాలు నడుపుతున్నారని తెలిపారు. దేశంలో 400 స్టార్టప్ లు , ఎలక్ట్రిక్ స్కూటర్లు , ఇ – రిక్షాలు మొదలైనవి తయారు చేస్తున్నాయని వెల్లడించారు. ఆర్డీ అండ్ ఎస్ హెచ్ హెచ్ లో ఆర్గానిక్ గార్డెన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు చేశారు.
సైన్స్ కాలేజీ ఎన్విరానిమెంట్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్స్ బై ఆర్ డి నేషనల్ కాలేజ్ అనే పుస్తకాన్ని విడుదల చేశారు. దేశంలో పర్యావరణ అనుకూలమైన, రీ స్లైక్లింగ్ కార్యక్రమాల వివరాలను పంచుకున్నారు. ఏదీ వృధా కాదని తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో వ్యర్థాల నుండి సంపదగా మార్చవచ్చని నితిన్ గడ్కరి(Nitin Gadkari).
గత ఎనిమిదేళ్లుగా నాగ్ పూర్ లోని మురుగు నీటిని రీ స్లైక్లింగ్ చేసి విద్యుత్ ఉత్పత్తి కోసం మరాఠా సర్కార్ కు విక్రయిస్తున్నామని చెప్పారు కేంద్ర మంత్రి.
Also Read : మోదీ వైఫల్యం తిరోగమన భారతం