Pralhad Joshi : బిల్కిస్ రేప్ నిందితుల విడుదల సబబే – జోషి
కేంద్ర మంత్రి కామెంట్స్ వివాదాస్పదం
Pralhad Joshi : ఈ దేశం ఎటు పోతోందో అర్థం కావడం లేదు. పదే పదే సంస్కృతి, సంప్రదాయాల గురించి మాట్లాడే భారతీయ జనతా పార్టీకి చెందిన నాయకులు దిగజారుడు మాటలతో దేశం పరువు తీస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది గుజరాత్ కు చెందిన బిల్కిస్ బానో సామూహిక అత్యాచార నిందితుల విడుదల వ్యవహారం.
దేశానికి స్వతంత్రం వచ్చిన పంధ్రాగస్టు రోజు ఏదో ఘనకార్యం చేశారని గుజరాత్ ప్రభుత్వం మొత్తం 11 మంది నిందితులను విడుదల చేసింది. దీనిపై సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ కూడా మౌనంగా ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఈ తరుణంలో వారిని విడుదల చేయడంలో గుజరాత్ సర్కార్ కంటే కేంద్ర ప్రభుత్వమే ముందు చర్యలు తీసుకుందని నివేదికలో వెల్లడి కావడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు రాహుల్ గాంధీ. తాజాగా కేంద్ర కేబినెట్ లో మంత్రిగా కొలువు తీరిన ప్రహ్లాద్ జోషి(Pralhad Joshi) సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన తన స్థాయికి దిగజారి మాట్లాడిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. జోషి జాతీయ మీడియాతో మాట్లాడుతూ బిల్కిస్ బానో గ్యాంప్ రేప్ నిందితుల విడుదలలో తప్పేం లేదన్నారు. సత్ ప్రవర్తనా నియమావళిని అనుసరించి చట్ట ప్రకారమే విడుదలయ్యారంటూ ఇందులో అభ్యంతరం లేదని చెప్పడంపై విపక్షాలు భగ్గుమన్నాయి.
మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇదిలా ఉండగా 11 మంది దోషుల శిక్షా కాలాన్ని గుజరాత్ ప్రభుత్వం తగ్గించి ముందుగానే విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషణ్లపై నవంబర్ 29న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Also Read : కాంగ్రెస్ బాద్ షా నువ్వా నేనా