Congress President Poll : కాంగ్రెస్ బాద్ షా నువ్వా నేనా
ఓట్ల లెక్కింపుపై ఉత్కంఠ
Congress President Poll : 137 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి 20 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్నారు. అక్టోబర్ 17న దేశ వ్యాప్తంగా ఎన్నికలు(Congress President Poll) జరిగాయి. మొత్తం 9,800 మందికి పైగా సభ్యులు (ప్రతినిధులు) తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
పూర్తిగా ఎన్నికల కమిషన్ రూల్స్ ను పాటించింది పార్టీ. ఎన్నికల బరిలో కర్ణాటకకు చెందిన రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖర్గే, అసమ్మతి వర్గం ముద్ర పడిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఉన్నారు. ఇద్దరూ పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. చివరి దాకా నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగింది.
కానీ విశ్వసనీయ సమాచారం మేరకు మల్లికార్జున్ ఖర్గేనే(Mallikarjun Kharge) కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నికవుతారని టాక్. ప్రస్తుతం పార్టీలో ఎంత మంది సీనియర్లు ఉన్నా గాంధీ ఫ్యామిలీని కాదని వెళ్లలేని పరిస్థితి. త్వరలోనే దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అంతే కాకుండా కర్ణాటకలో కూడా పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి.
వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని చివరకు సోనియా గాంధీ మల్లికార్జున్ ఖర్గేను ఎంపిక చేసింది. ఆయన దళితుడు కావడం విశేషం. సోమవారం జరిగిన ఎన్నికల్లో 9,915 మంది అర్హులైన సభ్యులలో 96 శాతం మంది ఓటు వేసినట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది.
ఓట్ల లెక్కింపు ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ మధుసూదన్ మిస్త్రీ వెల్లడించారు. మధ్యాహ్నం వరకు ఎవరు కాంగ్రెస్ పార్టీ తదుపరి చీఫ్ అవుతారని తేలనుంది.
Also Read : బిల్కిస్ బానో కేసుపై నవంబర్ 29న విచారణ