Elon Musk Spacex : స్టార్ లింక్ లైసెన్స్ కోసం ‘మ‌స్క్’ ద‌ర‌ఖాస్తు

భార‌త టెలికాంలో మ‌రో సంచ‌ల‌నం

Elon Musk Spacex : భార‌త టెలికాం రంగంలో మ‌రో సంచ‌లనానికి తెర లేపారు టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్. ఇప్ప‌టికే టెలికాం రంగాన్ని శాసిస్తున్న రిల‌య‌న్స్ జియో, ఎయిర్ టెల్ ఆధిప‌త్యానికి గండి కొట్టేందుకు రెడీ అయ్యారు మ‌స్క్. దేశంలో కొన్ని న‌గ‌రాల‌లో జియో, ఎయిర్ టెల్ లు 5జీ సేవ‌లు అందిస్తున్నాయి.

వీటితో పోటీ ప‌డేందుకు ఎలోన్ మ‌స్క్ రంగం సిద్దం చేశారు. ఇందులో భాగంగా త‌న కంపెనీ స్పేస్ ఎక్స్(Elon Musk Spacex) ద్వారా భార‌త దేశంలో స్టార్ లింక్ బ్రాడ్ బ్యాండ్ ను ప్రారంభించేందుకు లైసెన్స్ ఇవ్వాల‌ని కోరింది. ఈ మేర‌కు ఎలోన్ మ‌స్క్ భార‌త ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. ఈ స్పేస్ ఎక్స్ అనేది ఎలోన్ మ‌స్క్ కు చెందింది.

ఇది పూర్తిగా స్పేస్ నుంచి లింక్ చేసి నెట్ క‌నెక్టివిటీని అంద‌జేస్తుంది. ఎలాంటి అంత‌రాయాలు, ఇబ్బందులు అంటూ ఉండ‌వు. ఒక‌వేళ కేంద్ర స‌ర్కార్ ఎలోన్ మ‌స్క్ కు గ‌నుక ప‌ర్మిష‌న్ ఇస్తే రిల‌య‌న్స్ , ఎయిర్ టెల్ సంస్థ‌ల‌కు ఒకింత గ‌ట్టి దెబ్బ ప‌డ‌నుండ‌డం ఖాయం. ఒక వేళ అనుమ‌తి ల‌భిస్తే గ‌నుక స్పేస్ ఎక్స్ కు భారీగా డిమాండ్ ఏర్ప‌డే అవ‌కాశం ఉంది.

మరో వైపు ముందు జాగ్ర‌త్త‌గా భారతీ గ్రూపు మ‌ద్దతు క‌లిగిన ఒన్ వెబ్ , రిల‌య‌న్స్ జియో ఇన్ఫో కామ్ ఉప‌గ్ర‌హ విభాగాలు ఇప్ప‌టికే లైసెన్స్ పొందాయి. వీటితో పాటు లైసెన్స్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న మూడో కంపెనీ స్పేస్ ఎక్స్ కావ‌డం విశేషం.

Also Read : గీత దాటితే వేటు త‌ప్ప‌దు – టీసీఎస్ సీఓఓ

Leave A Reply

Your Email Id will not be published!