S Jai Shankar : తాను ఏం చేస్తున్నానో ప్ర‌జ‌లు గ‌మ‌నించాలి

కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జై శంక‌ర్

S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్ర‌మ‌ణ్యం జై శంక‌ర్(S Jai Shankar) కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను ఏమి చేస్తున్నానో మీరు అర్థం చేసుకోవాల‌ని కోరుకుంటున్నాని అన్నారు. ప్ర‌ధానమంత్రి ప్ర‌భుత్వ హ‌యాంలో గ‌త ఎనిమిదేళ్ల‌లో చాలా మార్పులు వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో జ‌రిగిన భార‌త దేశ విదేశాంగ విధానంపై జై శంక‌ర్ ప్ర‌సంగించారు.

ప్ర‌పంచానికి భ‌విష్య‌త్తును సిద్దం చేస్తున్న భార‌త‌దేశం కోసం యువ‌త‌ను ప్ర‌భావితం చేసే విధంగా విదేశీ వ్య‌వ‌హారాలై చురుకైన ఆస‌క్తిని క‌న‌బ‌ర్చాల‌ని కోరారు కేంద్ర మంత్రి. ప్ర‌ధానంగా విదేశాంగ మంత్రి ఏమి చేస్తున్నారో , విదేశాంగ విధానం ఇవాళ ప్ర‌తి ఒక్క‌రినీ ఎలా ప్ర‌భావితం చేస్తుందో ప్ర‌జ‌లు తెలుసు కోవాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు జై శంక‌ర్.

నా ముందు రెండు ప్ర‌ధాన ప‌నులు ఉన్నాయి. విదేశాంగ మంత్రికి రెండు పెద్ద ప‌నులు ఉన్నాయి. మొద‌ట భార‌త దేశాన్ని ప్రపంచానికి ప‌రిచ‌యం చేయ‌డం. రెండ‌వ‌ది ప్ర‌పంచంలోని దేశం గురించి మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించడమ‌ని పేర్కొన్నారు. త‌మ విదేశాంగ విధానంలో మూడు ప్ర‌ధాన పొర‌లు ఉన్నాయి.

మొద‌టిది భ‌ద్ర‌త కేంద్రీకృత‌మైన‌ది. రెండోది అభివృద్ది కేంద్రీకృత‌మైనది. మూడోది ప్ర‌జ‌ల‌తో కేంద్రీకృత‌మైన‌ద‌ని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. ఈరోజు ఎక్క‌డైనా ఏదైనా జ‌రిగిందా అది ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి ఒక్క‌రినీ ప్ర‌భావితం చేస్తుంద‌న్నారు జై శంక‌ర్(S Jai Shankar).

ఇవాళ ప్ర‌పంచానికి సంబంధించి మ‌నం సృష్టించిన గోడ‌ల‌న్నీ బ‌ద్ద‌ల‌య్యాయ‌ని అన్నారు. ప్ర‌పంచంలో ఎక్క‌డ ఏదైనా జ‌రిగినా దాని ప్ర‌భావాలు ప్ర‌తి చోటా క‌నిపిస్తున్నాయ‌న్నారు.

Also Read : సివిల్ కోడ్ చ‌ట్టం పార్ల‌మెంట్ కే అధికారం

Leave A Reply

Your Email Id will not be published!