VK Sasikala : విచారణకు ఎప్పుడైనా సిద్ధం – శశికళ
అమ్మను కంటికి రెప్పలా చూసుకున్నా
VK Sasikala : దివంగత సీఎం జయలలిత మరణంపై ఏర్పాటైన ఏ. ఆర్ముగస్వామి ఇచ్చిన నివేదిక ఇప్పుడు తమిళనాడులో కలకలం రేపుతోంది. ప్రధానంగా అన్నాడీఎంకే పార్టీలో ఎప్పుడు ఎవరి మీదకు వస్తుందోనన్న ఆందోళన నెలకొంది.
ఆనాటి సీఎం ఆరోగ్య విషయంలో అన్నీ తానై వ్యవహరిస్తూ వచ్చిన వీకే శశికళ(VK Sasikala) వ్యవహారం తో అనుమానాస్పదంగా ఉందని సీఎం ఎంకే స్టాలిన్ కు అందజేసిన కమిషన్ లో పేర్కొంది.
500 పేజీలకు పైగా నివేదిక అసెంబ్లీలో సమర్పించారు. ఇందులో అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో పాటు అపోలో ఎండీ , చైర్మన్ ప్రతాప్ రెడ్డి , అప్పటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్ కుమార్ లు తప్పుడు ప్రకటను చేశారని ఆరోపించారు. వీరందరిపై దర్యాప్తు చేపట్టాలని సూచించింది కమిషన్.
దీంతో అందరి కళ్లు ఇప్పుడు వీకే శశి కళ వైపు చూస్తుండడంతో బుధవారం స్పందించారు శశికళ. తాను జయలలిత మరణానికి సంబంధించి ఎలాంటి విచారణ ఎదుర్కొనేందుకు ఎప్పుడైనా సిద్దమని ప్రకటించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. తాను కంటికి రెప్పలా చూసుకున్నానని స్పష్టం చేశారు.
కమిషన్ పేర్కొన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఇదిలా ఉండగా అక్రమాస్తుల కేసులో వీకే శశికళ నాలుగు సంవత్సరాల పాటు జైలుకు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత అన్నాడీఎంకే తనదని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని, రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పారు.
తీరా మళ్లీ మాట మార్చారు. ఆ పార్టీ తనదేనంటూ ప్రకటించడం కలకలం రేపింది. ఈ తరుణంలో శశికళ పేరు బయటకు రావడం తలనొప్పిగా మారింది.
Also Read : అంతు చిక్కని ‘అమ్మ’ మరణం