Satya Nadella : ‘పద్మభూషణ్’ అందుకున్న సత్య నాదెళ్ల
జనవరిలో భారత్ కు వస్తానని ప్రకటన
Satya Nadella : ప్రముఖ దిగ్గజ ఐటీ కంపెనీ మైక్రో సాఫ్ట్ సిఇఓ సత్య నాదెళ్ల(Satya Nadella) భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇచ్చే అరుదైన పద్మ భూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. మోదీ సర్కార్ సత్య నాదెళ్లతో పాటు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్ ను కూడా ఎంపిక చేసింది. సత్య నాదెళ్ల తనకు ఈ గౌరవం లభించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
త్వరలోనే తాను భారత్ ను సందర్శిస్తానని చెప్పారు. ఇదిలా ఉండగా సత్య నాదెళ్ల హైదరాబాద్ లో పుట్టారు. 2014లో మైక్రోసాఫ్ట్ సిఇఓగా నియమితులయ్యారు. జూన్ 2021న ఆయన కంపెనీకి చైర్మన్ గా ఎంపికయ్యారు. బోర్డుకు ఎజెండాను రూపొందించే పనిలో సత్య నాదెళ్ల కీలక పాత్ర పోషిస్తారు.
అమెరికాలో జరిగిన కార్యక్రమంలో సత్య నాదెళ్ల పద్మ భూషణ్ అవార్డును స్వీకరించారు. ఈ ఏడాది ప్రారంభంలో కేంద్రం ప్రకటించిన 17 మంది అవార్డు గ్రహీతల్లో సత్య నాదెళ్ల కూడా ఒకరు. భారత దేశానికి సంబంధించి మూడవ అత్యున్నత పురస్కారం అందుకోవడం తనకు గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
సాంకేతికతను మరింతగా సాధించేందుకు దేశ ప్రజలతో కలిసి పని చేయడం కోసం తాను ఎదురు చూస్తున్నానని చెప్పారు. భారత్ కాన్సుల్ డాక్టర్ టి.వి.నాగేంద్ర ప్రసాద్ నుండి విశిష్ట సేవలకు గాను అధికారికంగా అందుకున్నారు. దేశంలో సమ్మిళిత వృద్ధికి సాధికారత కల్పించడంలో డిజిటల్ టెక్నాలజీ పోషిస్తున్న కీలక పాత్రపై సత్య నాదెళ్ల ప్రసాద్ తో చర్చించారు.
ఇదే సమయంలో మనం చారిత్రక , ఆర్థిక, సామాజిక, సాంకేతిక మార్పుల కాలంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు.
Also Read : దీపావళికి మోదీ బంపర్ ఆఫర్