PM Modi Guterres : మిషన్ లైఫ్ ఉద్యమానికి శ్రీకారం – మోదీ
సంతకం చేసిన గుటెరెస్..ప్రధాని
PM Modi Guterres : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi Guterres) మరో కీలక ప్రకటన చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు , సంరక్షించడంతో పాటు సామూహిక చర్యను ప్రోత్సహించే లక్ష్యంతో మిషన్ లైఫ్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గురువారం ఐక్య రాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ తో కలిసి ప్రధాన మంత్రి మిషన్ లైఫ్ కు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా భారత్ ఈ విషయంలో కీలకంగా వ్యవహరించడం అభినందించదగిన విషయమని కొనియాడారు గుటెర్రెస్. ఈ మిషన్ లైఫ్ అనేది అంతర్జాతీయ ప్లాట్ ఫారమ్ లలో వాతావరణ చర్యను ప్రదర్శించేందుకు , సుస్థిర అభివృద్ది లక్ష్యాలను ముందస్తుగా సాధించేందుకు భారత్ తో పాటు ఇతర దేశాలు కృషి చేయనున్నాయి.
ఈ విషయం గురించి కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. వాతావరణ మార్పు ప్రభుత్వ విధానానికి లోబడి ఉందన్నారు. విధాన రూపకల్పనకు మించినదని పేర్కొన్నారు ప్రధానమంత్రి.
చిన్నపాటి చర్యలు వాతావరణంపై వినాశకరమైన ప్రభావాన్ని ఎలా చూపుతాయనే విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ. కొంత మంది వ్యక్తులు ఏసీ ఉష్ణోగ్రతలను 17 డిగ్రీలకు తగ్గించడానికి ఇష్ట పడతారు. ఇది పర్యావరణంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందన్నారు.
హిమనీనదాలు కరిగి పోతున్నాయి. నదులు ఎండి పోతున్నాయి. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సాయం చేస్తుందన్నారు మోదీ.
పునరుత్పాదక ఇంధనం, పర్యావరణ పరిరక్షణ కోసం పని చేయడం ప్రారంభించిన రాష్ట్రాలలో గుజరాత్ ఒకటి అని పేర్కొన్నారు మోదీ.
Also Read : ‘పద్మభూషణ్’ అందుకున్న సత్య నాదెళ్ల