Kanna Lakshminarayana : కన్నా కాస్త తగ్గితే మంచిది – బీజేపీ
ఎలాంటి ప్రకటనలు చేయొద్దు
Kanna Lakshminarayana : భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ(Kanna Lakshminarayana) చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాలలో కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా బీజేపీలో. ఆయన పార్టీ అధ్యక్షుడు సోమూ వీర్రాజును దృష్టిలో పెట్టుకుని మాటల తూటాలు పేల్చారు. ఆయన గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకుడిగా ఉన్నారు.
ఆ తర్వాత బీజేపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. కొందరి నిర్వాకం కారణంగా తను పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఇది పక్కన పెడితే జనసేన పార్టీ అధ్యక్షుడితో బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు సరిగా వ్యవహరంచ లేదంటూ ఆరోపణలు సంధించారు. ఇదిలా ఉండగా విశాఖలో చోటు చేసుకున్న ఘటన తర్వాత జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సీరియస్ గా స్పందించారు.
ఆయన ఏకంగా జగన్ ను , పార్టీని టార్గెట్ చేశారు. సంచలన ఆరోపణలు కూడా చేశారు. కాస్తా నోరు కూడా జారారు. తనను ప్యాకేజ్ స్టార్ అంటే చెప్పుతో కొడతానంటూ ప్రకటించారు. ఇదే సమయంలో విజయవాడలో ఉన్న పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వద్దకు స్వయంగా వెళ్లారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు.
ఈ మేరకు ఆయనకు సంఘీభావం ప్రకటించారు. కానీ ఎందుకుని సోమూ వీర్రాజు చొరవ తీసుకోలేక పోయారంటూ కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఇది పార్టీలో తీవ్ర దుమారం రేపింది. దీనిపై బీజేపీ హై కమాండ్ స్పందించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రస్తుతానికి మౌనం వహించడం మంచిదని సూచించింది.
కాగా కన్నా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మరి ఆయన పవన్ కళ్యాన్ తో ఉంటారా లేక చంద్రబాబుకు జై కొడతారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.
Also Read : రాహుల్ పాదయాత్రకు జన నీరాజనం