KTR : ఎన్నిక‌ల క‌మిష‌న్ పై కేటీఆర్ ఫైర్

మునుగోడు రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీ

KTR : మంత్రి కేటీఆర్ కేంద్ర ఎన్నికల క‌మిష‌న్ పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నిక‌లు (Munugodu ByPoll) జ‌రుగుతున్న త‌రుణంలో ఎన్నిక‌ల అధికారిని ఎలా బ‌దిలీ చేస్తారంటూ ప్ర‌శ్నించారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు మంత్రి. మునుగోడులో బీజేపీకి ఓట‌మి త‌ప్ప‌ద‌ని, అందుకే ముందు జాగ్ర‌త్త‌గా ఇలా బ‌దిలీ చేసిందంటూ ఆరోపించారు.

కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్ర‌భుత్వం రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను ఎలా నీరు గారుస్తుందో ఇదో చ‌క్క‌డి ఉదాహ‌ర‌ణ అని స్ప‌ష్టం చేశారు. ఇలాంటి త‌ప్పుడు నిర్ణ‌యాల వ‌ల్ల ఏం సందేశం ఇవ్వ‌ద‌ల్చుకున్నారో చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ఆక్షేప‌ణ‌య‌మ‌ని పేర్కొన్నారు.

పార్టీల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రించాల్సిన కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ ఇలా ప‌క్ష‌పాత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రించ‌డం ఎంత మాత్రం మంచిది కాద‌న్నారు. ఒక ర‌కంగా ఎన్నిక‌ల క‌మిష‌న్ పై బీజేపీ తీవ్ర‌మైన ఒత్తిడి తీసుకు రావ‌డం వ‌ల్ల‌నే మునుగోడు ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారిని బ‌దిలీ చేశార‌ని ఆరోపించారు కేటీఆర్.

త‌మ పార్టీకి చెందిన గుర్తును పోలిన గుర్తుల‌ను కేటాయించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. దీని వ‌ల్ల ఓట‌ర్లు అయోమయానికి గుర‌వుతార‌ని , త‌మ‌కు న‌ష్టం చేసేందుకే బీజేపీ ఇలా ప్లాన్ చేసిందంటూ మండిప‌డ్డారు రాష్ట్ర మంత్రి. బీజేపీ రాజ్యాంగ వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేస్తున్న తీరును ప్ర‌జ‌లు గ‌మ‌నంచాల‌ని కేటీఆర్(KTR) కోరారు.

ఇక నుంచి తాము ప్ర‌త్య‌క్షంగా పోరాటం చేస్తామ‌ని హెచ్చ‌రించారు. రిట‌ర్నింగ్ ఆఫీస‌ర్ బ‌దిలీని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.

Also Read : క‌న్నా కాస్త త‌గ్గితే మంచిది – బీజేపీ

Leave A Reply

Your Email Id will not be published!