BJP TOP : రాష్ట్రాల ఎన్నికల ఖర్చులో బీజేపీ టాప్
కాషాయ పార్టీ రూ. 223 కోట్లు తర్వాత కాంగ్రెస్
BJP TOP : దేశంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీకి లెక్కలేనన్ని నిధులు విరాళాల రూపంలో సమకూరుతున్నాయి. వీటికి లెక్కా పత్రం అంటూ ఉండదు. ఇక ఖర్చుల విషయంలో విరాళాల విషయంలో గతంలో కాంగ్రెస్ పార్టీ టాప్ లో ఉండేది. కానీ సీన్ మారింది. సిట్యూయేషన్ కూడా మారింది.
జాతీయ పార్టీలు విస్తు పోయేలా దేశంలో కాషాయ పార్టీకి లెక్కించ లేనంతటి కాసులు అందుతున్నాయనేది వాస్తవం. దీనిని బట్టబయలు చేసింది ఎప్పటి లాగే అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) . తాజాగా గురువారం తన నివేదికను విడుదల చేయడంతో పార్టీల బండారం బట్టబయలు అయ్యింది.
ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. వాటిలో గోవా, పంజాబ్ , ఉత్తరాఖండ్ , మణిపూర్ , యూపీ రాష్ట్రాలు ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసిన పార్టీగా టాప్ లో(BJP TOP) నిలిచింది కాషాయ పార్టీ. అన్ని పార్టీలు కలిపి రూ. 470 కోట్లు ఖర్చు చేశాయి.
కానీ వీటిలో ఏకంగా రూ. 223 కోట్లు బీజేపీ ఖర్చు చేసింది. ఇదే క్రమంలో ఆ పార్టీకి రూ. 914 కోట్ల నిధులు సమకూరడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. ఆ పార్టీ రూ. 102.65 కోట్లు ఖర్చు చేసింది. బీఎస్ఈ రూ. 69 కోట్లు ఖర్చు చేసింది. మొత్తంగా పోటీ చేసిన 13 పార్టీలకు కలిపి రూ. 1441.7 కోట్ల నిధులు సమకూరినట్లు ఏడీఆర్ కుండ బద్దలు కొట్టింది.
ప్రచారానికి , ఇతర వాటికి ఖర్చు చేసినట్లు ఆయా పార్టీలు పేర్కొన్నాయి.
Also Read : మిషన్ లైఫ్ ఉద్యమానికి శ్రీకారం – మోదీ