Liz Truss : లిజ్ ట్రస్ రాజీనామాతో పరేషాన్
బ్రిటన్ లో కొనసాగుతున్న సంక్షోభం
Liz Truss : బ్రిటన్ లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కేవలం ఆరు వారాలకే తాను పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు దేశ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్. ఇక తనకు పాలన చేత కాదంటూ చేతులెత్తేశారు. దీంతో ప్రతిపక్షాలు వెంటనే సాధారణ ఎన్నికలు చేపట్టాలని డిమాండ్ చేశాయి.
ఇదిలా ఉండగా ప్రధానమంత్రిగా కొలువు తీరిన లిజ్ ట్రస్(Liz Truss) ఆరు వారాలకే తప్పుకున్నారు ప్రధాని పదవి నుంచి. ఇక తదుపరి ప్రధానమంత్రిగా ఎన్నుకునేంత వరకు లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా ఉంటారు. వచ్చే వారం రోజుల్లో కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలను చేపట్టనుంది.
ఇప్పటికే లిజ్ ట్రస్ తో పాటు ప్రవాస భారతీయుడైన రిషి సునక్ మధ్య గట్టి పోటీ నెలకొన్నా చివరకు ట్రస్ విజయం సాధించారు. కానీ అంతలోనే తాను కంట్రోల్ చేయలేక పోయారు. ఇప్పటి వరకు ప్రధానమంత్రిగా ఉన్న బోరిస్ జాన్సన్ పై స్కాంల ఆరోపణలు వెల్లువెత్తడంతో పొలిటికల్ సంక్షోభం నెలకొంది.
దీంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. పెద్ద ఎత్తున ఉత్కంఠకు తెర దించుతూ లిజ్ ట్రస్ ప్రధానమంత్రిగా కొలువుతీరారు. ఎన్నో అంచనాల మధ్య ఆమె పదవిని అలంకరించినా చివరకు గుడ్ బై చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇదే సమయంలో ప్రస్తుత కేబినెట్ లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన మంత్రి, మాజీ హోం శాఖ కార్యదర్శి సుయెల్లా బ్రేవర్ మాన్ తప్పుకున్నారు.
అనంతరం లిజ్ ట్రస్ రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అస్తవ్యవస్తమైన పార్లమెంటరీ ఓటింగ్ లో టోరీ ఎంపీలు తిరుగుబాటు చేశారు.
Also Read : యుఎస్ వెళ్లకుండా అడ్డుకున్నారు -సన్నా