Prashant Kishor : నా దగ్గర ఆధారాలు ఉన్నాయి – పీకే
ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కామెంట్స్
Prashant Kishor : జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీశ్ కుమార్ భారతీయ జనతా పార్టీలో మరోసారి చేరడం ఖాయమని సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై జేడీయూ తీవ్రంగా ఖండించింది. నితీశ్ కుమార్ తో పాటు ప్రశాంత్ కిషోర్(Prashant Kishor) ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ మరింత రక్తి కట్టిస్తున్నారు.
పీకే చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని జేడీయూ బీహార్ చీఫ్ లాలన్ సింగ్ నిప్పులు చెరిగారు. ఇదంతా గేమ్ ప్లాన్ లో భాగమేనంటూ మండిపడ్డారు. పీకే పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పేరుతో భారతీయ జనతా పార్టీకి అంతర్గత మేలు చేకూర్చేలా చేస్తున్నారంటూ ఆరోపించారు. గతంలో పీకే జేడీయూలో చేరారు.
సీఎం నితీశ్ కుమార్ తో విభేదించి 2020లో బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా ఇటీవల 17 ఏళ్ల పాటు పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ తో తెగ తెంపులు చేసుకున్నారు. ఆపై ఆర్జేడీ, కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి మహా కూటమి పేరుతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
ఇదే సమయంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించింది జేడీయూ. ఇదే క్రమంలో పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బహిష్కరించారు ప్రశాంత్ కిషోర్ ను. ఇప్పటికీ బీజేపీతో తెంచుకున్నా ఇంకా తలుపులు మూసుకోలేదని పీకే కుండ బద్దలు కొట్టారు.
ఇందుకు సంబంధించి తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు ప్రశాంత్ కిషోర్. ఓ వైపు మహా ఘట్ బంధన్ ఉన్నా ఇంకో వైపు బీజేపీతో టచ్ లో ఉన్నారని ఆరోపించారు.
Also Read : ఓడి పోయినందుకు బాధ లేదు – శశి థరూర్