Dasoju Sravan : బీజేపీకి దాసోజు శ్ర‌వ‌ణ్ గుడ్ బై

గులాబీ తీర్థం పుచ్చుకోనున్న నేత

Dasoju Sravan : తెలంగాణ మేధావుల‌లో ఒక‌డిగా పేరొందిన డాక్ట‌ర్ దాసోజు శ్ర‌వ‌ణ్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను భార‌తీయ జ‌న‌తా పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇంత కాలం పని చేసిన టీఆర్ఎస్ గూటికి చేర‌నున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ కు త‌న రాజీనామా లేఖ‌ను పంపించారు.

దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆయ‌న సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ లో చేర‌నున్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఇద్ద‌రు ఉద్య‌మ నేత‌లు సైతం గులాబీ తీర్థం పుచ్చుకోనున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కీల‌క‌మైన పాత్ర పోషించారు దాసోజు శ్ర‌వ‌ణ్(Dasoju Sravan).

ఆయ‌న మొద‌ట ప్ర‌జా రాజ్యంలో ఉన్నారు. ఆ త‌ర్వాత టీఆర్ఎస్ లో చేరారు. అక్క‌డ అధికార ప్ర‌తినిధిగా చేశారు. అనంత‌రం కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్క‌డ జాతీయ అధికార ప్ర‌తినిధిగా ఉన్నారు. ఉన్న‌ట్టుండి ఇటీవ‌లే ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీజేపీలో చేరారు. ఉన్న‌ట్టుండి ఆ పార్టీకి కూడా రాజీనామా చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

తిరిగి తాను ఎక్కువ కాలం పాటు ప‌ని చేసిన సీఎం కేసీఆర్ టీంలోకి వెళ్ల‌నున్నారు దాసోజు శ్ర‌వ‌ణ్. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కాషాయ కండువా క‌ప్పి ఆయ‌న‌ను పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజులుగా దాసోజు శ్ర‌వ‌ణ్ టీఆర్ఎస్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్లు టాక్. బీజేపీ తెలంగాణ‌లో దిశా ద‌శా లేని విధంగా న‌డుస్తోందంటూ ఆరోపించారు.

అంత‌కు ముందు త‌రుణ్ చుగ్ ఆధ్వ‌ర్యంలో పార్టీలో చేరారు.

Also Read : చిన్నారి రేప్ పై గ‌వ‌ర్న‌ర్ ఫైర్

Leave A Reply

Your Email Id will not be published!