TRS Joining : గులాబీ గూటికి దాసోజు..స్వామి గౌడ్
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలం
TRS Joining : మునుగోడు ఉప ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నాయకుడిగా, మేధావిగా పేరొందిన డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ ఆచారి , ఉద్యోగ సంఘాల నాయకుడిగా పేరొందిన స్వామి గౌడ్(Swamy Goud) కాషాయ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆ ఇద్దరూ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితిలో(TRS Joining) చేరారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఆ ఇద్దరికీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా శ్రవణ్ కుమార్(Sravan Dasoju) మొదట ఉద్యమకారుడిగా ఉన్నారు. అమెరికాలో ఐటీ కంపెనీలో పని చేశారు. అనంతరం చిరంజీవి ప్రజారాజ్యంలో చేరారు. అక్కడ పొసగక తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. పార్టీ అధికార ప్రతినిధిగా పని చేశారు.
పార్టీలో ప్రజాస్వామ్యం లేదంటూ రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అక్కడ కీలకమైన నాయకుడిగా పేరొందారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఆ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధిగా పని చేశారు. ఆ పార్టీకి ఇటీవలే గుడ్ బై చెప్పారు. భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఏమైందో ఏమో కానీ బీసీలకు బీజేపీలో స్థానం లేదని బడా బాబులు, కాంట్రాక్టర్లు, వ్యాపారవేత్తలకు ప్రయారిటీ ఉందంటూ ఆరోపించారు. ఇదిలా ఉండగా ఉద్యమ కాలంలో ఉద్యోగ సంఘాల నాయకుడిగా పేరొందారు స్వామి గౌడ్ . ఆయన టీఆర్ఎస్ లో చేరారు .
స్పీకర్ గా ఉన్నారు. బీజేపీలో చేరారు. తర్వాత తిరిగి గులాబీ గూటికి చేరారు. మొత్తంగా టీఆర్ఎస్ లో ఇద్దరు కీలక నేతలు తిరిగి చేరడంతో ఆ పార్టీలో పుల్ జోష్ నెలకొంది.
Also Read : బతికి ఉండగానే సమాధి కడతారా