UK PM Race : బ్రిట‌న్ పీఎం రేసులో రిషి సున‌క్ ..పెన్నీ

బోరిస్ జాన్స‌న్ మ‌ద్ద‌తు కీల‌కం

UK PM Race : బ్రిట‌న్ లో రాజ‌కీయ సంక్షోభం ఇంకా కొన‌సాగుతోంది. మ‌రో వైపు స్టాక్ మార్కెట్ లో అనూహ్యంగా హెచ్చు త‌గ్గులు ఏర్ప‌డ‌డం ఒకింత మార్కెట్ వ‌ర్గాల‌ను విస్తు పోయేలా చేశాయి. అవినీతి ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డం , కేబినెట్ లో ఇద్ద‌రు కీల‌క మంత్రులు రాజీనామా చేయ‌డంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు బోరిస్ జాన్స‌న్.

త‌ను త‌ప్పుకునేందుకు ప్ర‌ధాన కార‌ణం ప్ర‌వాస భార‌తీయుడైన త‌న స‌హ‌చ‌రుడు రిషి సున‌క్ అని న‌మ్మారు. ఎలాగైనా స‌రే బ‌రిలో ఉన్న రిషిని ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. మొత్తం నాలుగు రౌండ్ల ప్ర‌క్రియ‌లో మూడు రౌండ్ల వ‌ర‌కు రిషి సున‌క్ ఆధిప‌త్యం వ‌హిస్తూ వ‌చ్చారు. కానీ చివ‌ర‌గా ఫైన‌ల్ రౌండ్ లో అనూహ్యంగా విదేశాంగ శాఖ నిర్వ‌హించిన లిజ్ ట్ర‌స్ ముందంజ‌లో కొన‌సాగింది.

అనంత‌రం ప్ర‌ధాన మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టింది. ఆరు వారాల త‌ర్వాత ఉన్న‌ట్టుండి తాను పీఎం ప‌ద‌వి నిర్వ‌హించ లేనంటూ రాజీనామా చేసింది. దీంతో అధికార క‌న్జ‌ర్వేటివ్ పార్టీలో ముసలం ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం 100 మంది క‌న్జ‌ర్వేటివ్ పార్టీ ప్ర‌తినిధులు రిషి సున‌క్ కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు ప్ర‌చారం జోరందుకుంది.

మ‌రో వైపు ప్ర‌తిప‌క్షాలు అధికార ప‌క్షంపై నిప్పులు చెరిగాయి. వెంట‌నే సాధార‌ణ ఎన్నిక‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశాయి. ఈ త‌రుణంలో రిషి సున‌క్ , పెన్నీ మార్డెంట్ మ‌ధ్య రేసు మ‌ళ్లీ(UK PM Race) మొద‌లైంది. ఈ ఇద్ద‌రిలో ప్ర‌స్తుతం సంక్షోభం నుంచి గ‌ట్టెక్కేందుకు బోరిస్ జాన్స‌న్ రిషి సున‌క్ కే మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్లు టాక్.

Also Read : బ్రిట‌న్ ప్ర‌ధాని రేసులో రిషి సున‌క్

Leave A Reply

Your Email Id will not be published!