Nagaland CM : ప్రత్యేక నాగాలాండ్ డిమాండ్ తప్పు కాదు
నాగాలాండ్ సీఎం నీఫియు రియో కామెంట్స్
Nagaland CM : ప్రత్యేక రాష్ట్రాన్ని నాగాలాండ్ లోని కొందరు ప్రజలు కోరడంలో ఎలాంటి తప్పు లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నీఫియు రియో(Nagaland CM). ప్రత్యేక రాష్ట్రం కోరే హక్కు ప్రతి ఒక్కరికి ఉండడంలో ఆశ్చర్య పోవాల్సింది ఏముందని ప్రశ్నించారు. వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలను తాము పరిగణలోకి తీసుకుంటామన్నారు.
తమకు ఏం కావాలో అడిగే హక్కు ఉందన్నారు. అంతే కాదు తాము ఏం చేస్తున్నామో అడిగే హక్కు కూడా ఉందన్నారు సీఎం. అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుందని చెప్పారు. ప్రజల ఆలోచనలను తాము గుర్తిస్తామని స్పష్టం చేశారు.
ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు రియో. తూర్పు ప్రాంత ప్రజలు ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ వస్తున్న విషయం తాము గుర్తించామన్నారు. నాగా లాండ్ లోని తూర్పు ప్రాంతా ప్రజలు గత కొంత కాలం నుంచి కోరుతూ వస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా తూర్పు నాగాలాండ్ లో ఆరు జిల్లాలు ఉన్నాయి.
మోన్ , ట్యూన్ సాంగ్ , కిఫిరే, లాంగ్ లెంగ్ , నో క్లాక్ , షామటోర్ …వీటిలో చాంగ్ , ఖియామ్ని యుంగాన్ , కొన్యాక్ , ఫోమ్ , సాంగ్టమ్ , తిఖిర్ , యిమ్ ఖియుంగ్ లోని ఏడు తెగలు నివసిస్తున్నాయి. తూర్పు నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ (ఈఎన్పీఓ) తదుపరి హార్న్ బిల్ ఫెస్టివల్ లో పాల్గొనకూడదని నిర్ణయించిందని సీఎంకు తెలిపారు .
అంతే కాదు ప్రత్యేక రాష్ట్ర డమాండ్ కు మద్దతుగా ఈ ప్రాంతానికి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అనుకుంటున్నట్లు సీఎంకు తెలిపారు.
Also Read : రాహుల్ దివ్యాంగ కళాకారుడు – సారంగ్