ISRO LVM3 : నిప్పులు చిమ్ముకుంటూ నింగికేగిన రాకెట్
ఇస్రో ఎల్వీఎం -3 గ్రాండ్ సక్సెస్
ISRO LVM3 : భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చరిత్రలో(ISRO LVM3) మరో మైలురాయిని అందుకుంది. బాహుబళి జీఎస్ల్వీ మార్క్ -3 రాకెట్ ను విజయవంతంగా లాంచ్ చేసింది. ఏపీలోని తిరుపతిలో ఉన్న సతీష్ ధావన్ సెంటర్ నుండి ప్రయోగించింది ఈ రాకెట్ ను. శనివారం అర్ధరాత్రి దీనిని చేపట్టింది.
నిప్పులు చిమ్ముకుంటూ రాకెట్ దూసుకు వెళ్లింది. ఇదిలా ఉండగా ఈ రాకెట్ కు విశేషమైన ప్రత్యేకత ఉంది. అదేమిటంటే విదేశాలకు చెందిన 36 ఉప గ్రహాలను ఇందులో ప్రవేశ పెట్టింది. కక్ష్యలోకి పంపించింది. దీనిని విజయవంతంగా పంపించడంలో ఇస్రో కీలక పాత్ర పోషించింది. ఎంతో ఖర్చుతో తయారు చేసిన ఈ రాకెట్ కేవలం 19 నిమిషాల్లోనే ముగియడం విశేషం.
ఇస్రో ఈసారి వినూత్నంగా ప్రయోగించింది. వాణిజ్య విభాగానికి చెందిన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ కోసం చేపట్టింది దీనిని. ఇదిలా ఉండగా ఇస్రో పరంగా చూస్తే దానిని ఏర్పాటు చేసిన ఇన్నేళ్ల తర్వాత వాణిజ్య ప్రయోగం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇది ప్రైవేట్ శాటిలైట్ కమ్యూనికేషన్ కంపెనీ అయిన వన్ వెబ్ కు చెందిన 36 బ్రాడ్ బ్యాండ్ ఉపగ్రహాలను ఈ రాకెట్ ద్వారా నింగిలోకి పంపించారు.
యునైటెడ్ కింగ్ డమ్ కు చెందినవి ఈ ఉప్రగహాలు. వీటి మొత్తం బరువు కలిపి 5,200 కిలోల బరువు ఉన్నాయి. ఇదిలా ఉండగా తాము చేసిన ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 108 ఉపగ్రహాలను పంపించాలని ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. మొదటి విడతగా 36 ఉపగ్రహాలను పంపామన్నారు.
Also Read : హిందీ అక్షరాస్యతా గ్రామంగా చెలన్నూరు