CM Bommai : మంత్రి సోమన్నపై సీఎం సీరియస్
వివరణ ఇవ్వాలని ఆదేశించిన బొమ్మై
CM Bommai : దేశ వ్యాప్తంగా కర్ణాటక భారతీయ జనతా పార్టీకి చెందిన గృహ నిర్మాణ శాఖ మంత్రి వి. సోమన్న (V Somanna) పై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మహిళలు, ప్రతిపక్షాలు, సామాన్యులు నిప్పులు చెరుగుతున్నారు. తనకు న్యాయం చేయాలని కోరిన మహిళను విచక్షణ కోల్పోయి చెంప ఛెళ్లుమనిపించిన మంత్రి నిర్వాకంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
ఇప్పుడు సోషల్ మీడియాలో వి. సోమన్న ట్రెండింగ్ గా మారారు. మరో వైపు నిన్న రాత్రి డిప్యూటీ స్పీకర్ ఆనంద్ కన్ను మూశారు. ఓ వైపు తీవ్ర విషాదంలో ఉన్న కర్ణాటక సీఎం కు సోమన్న రూపంలో మరో తలనొప్పి వచ్చి పడింది. ఇప్పటికే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కమీషన్, కరప్షన్ కు కేరాఫ్ గా మారిందంటూ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
ఈ తరుణంలో మంత్రి సోమన్న ప్రవర్తించిన తీరు అటు ప్రభుత్వానికి ఇటు బీజేపీకి తీవ్ర తలనొప్పులు తెచ్చేలా ఉండడంతో రంగంలోకి దిగారు సీఎం బస్వరాజ్ బొమ్మై(CM Bommai) . ఈ మొత్తం ఘటనకు సంబంధించి తనకు వివరణ ఇవ్వాలని మంత్రి వి. సోమన్నను ఆదివారం ఆదేశించారు సీఎం.
వెంటనే తనకు కావాలని కోరారు. దీంతో వి. సోమన్న హడావుడిగా సీఎంను కలిసేందుకు ప్రయత్నం చేశారు. మరో వైపు హై కమాండ్ నుంచి కూడా ఆరా తీసినట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు జై రాం రమేష్, రణ్ దీప్ సూర్జేవాలా, తదితర నేతలు వి. సోమన్న అనుసరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టారు. వెంటనే సోమన్నను మంత్రి వర్గం నుంచి తొలగించాలంటూ డిమాండ్ చేశారు.
Also Read : కర్ణాటక మంత్రి నిర్వాకం సర్వత్రా ఆగ్రహం