Komatireddy Venkat Reddy : కోమ‌టిరెడ్డికి షాక్ షోకాజ్ నోటీసు

ఆడియోపై వివ‌ర‌ణ ఇవ్వాల‌ని ఆదేశం

Komatireddy Venkat Reddy : కాంగ్రెస్ పార్టీకి చెందిన భువ‌న‌గిరి ఎంపీ కోమటిరెడ్డి వెంక‌ట్ రెడ్డికి(Komatireddy Venkat Reddy) కోలుకోలేని షాక్ త‌గిలింది. పార్టీకి ప్ర‌చారం చేసినా లాభం లేద‌ని, పైస‌లు ఖర్చు చేసేందుకు డ‌బ్బులు లేవ‌ని పేర్కొన్నారు. ఆపై అక్క‌డ ఓడిపోయే సీటు కోసం ఎందుకు ప్ర‌చారం చేయాల‌ని చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది.

అంతే కాదు కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ రెండూ బ‌ల‌మైన ప్ర‌భుత్వాల‌ని, విచ్చ‌ల‌విడిగా డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నాయ‌ని ఆరోపించారు. మ‌రో వైపు తానే టీపీసీసీ చీఫ్ అవుతాన‌ని చెప్ప‌డం క‌ల‌క‌లం రేపింది. పార్టీలో ఉంటూ , ఎంపీగా గెలిచిన వెంక‌ట్ రెడ్డి ఇలా బాధ్యతా రాహిత్యంతో ఎలా కామెంట్స్ చేస్తారంటూ ఏఐసీసీ ప్ర‌శ్నించింది.

ఈ మేర‌కు ఆయ‌న‌కు ఆదివారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి ఇక్క‌డ ఉండ‌కుండా ఫ్యామిలీతో క‌లిసి త‌మ్ముడి కోసం ఆస్ట్రేలియాలో ఉండ‌డాన్ని త‌ప్పు ప‌ట్టింది. ప్ర‌స్తుతం ఏఐసీసీ జారీ చేసిన షోకాజ్ తో కోమ‌టిరెడ్డి షాక్ కు గుర‌య్యారు.

త‌న‌కు నోటీసు ఇచ్చే శ‌క్తి పార్టీకి లేద‌ని న‌మ్ముతూ వ‌చ్చారు. మ‌రోవైపు మునుగోడులో పార్టీ అభ్య‌ర్థిగా పాల్వాయి స్ర‌వంతి రెడ్డి బ‌రిలో ఉన్నారు. కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అంతా తానై వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం పార్టీలో సీనియ‌ర్ల‌ను దూరం చేసింది. మొత్తంగా బ‌ల‌మైన క్యాడ‌ర్ ఉన్నప్ప‌టికీ పార్టీకి పార్టీలోని వారే ప్ర‌ధాన అడ్డంకిగా మారింది. ఇదే ఇప్పుడు చ‌ర్చ‌కు దారి తీసింది రాష్ట్ర వ్యాప్తంగా.

Also Read : మునుగోడులో గులాబీదే విజ‌యం – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!