Covid19 : త‌గ్గుతూ పెరుగుతున్న క‌రోనా కేసులు

1,334 కేసులు న‌మోదు దేశ‌వ్యాప్తంగా

Covid19 : రోజు రోజుకు క‌రోనా కేసులు త‌గ్గుతూ పెరుగుతున్నాయి. ఓ వైపు కేంద్ర స‌ర్కార్ సీరియ‌స్ గా తీసుకుంది. బూస్ట‌ర్ డోస్ వేసుకోవాల‌ని సాక్షాత్తు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునిచ్చారు. తాజాగా దేశంలో 1,334 కొత్త కోవిడ్ కేసులు(Covid19) న‌మోద‌య్యాయి. 24 గంట‌ల్లో 16 వైర‌స్ సంబంధిత మ‌ర‌ణాలు సంభ‌వించాయి.

5,28,977కి చావులు సంభ‌వించాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కేర‌ళ‌లో 12 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. ఇవాళ కేంద్ర కుటుంబ‌, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. మొత్తం ఇన్ఫెక్ష‌న్ ల‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 0.05 శాతం ఉన్నాయి. గ‌త 188 రోజుల‌లో ఇదే అత్యల్పంగా న‌మోదు కావ‌డం ఇదే మొద‌టిసారి కావ‌డం విశేషం.

తాజా న‌మోదైన కేసుల సంఖ్య 4,46,44,076కు చేరింది. క్రియాశీల సంఖ్య 23,193కి త‌గ్గింద‌ని కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. దీంతో జాతీయ రిక‌వ‌రీ రేటు 98.76 శాతానికి పెరిగింది. యాక్టివ్ కోవిడ్ -19 కేసుల్లో 24 గంట‌ల వ్య‌వ‌ధిలో 239 కేసులు త‌గ్గిన‌ట్లు తెలిపింది.

ఇక రోజూ వారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా న‌మోదు కాగా వారం వారీ పాజిటివిటీ రేటు 0.95 శాతంగా ఉంది. ఇక వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య 4,40,91,906కు పెరిగింది. కేసు మ‌ర‌ణాల సంఖ్య 1.18 శాతంగా న‌మోదైంది. ఇక మంత్రిత్వ శాఖ ప్ర‌కారం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ డ్రైవ్ కింద ఇప్ప‌టి వ‌ర‌కు 219.56 కోట్ల డోస్ లు పంపిణీ చేసింది.

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. పెద్ద ఎత్తున కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం.

Also Read : 31న మునుగోడులో బీజేపీ బ‌హిరంగ స‌భ‌

Leave A Reply

Your Email Id will not be published!