Kerala CM : కేరళ గవర్నర్ తీరుపై సీఎం సీరియస్
ఆర్ఎస్ఎస్ చేతిలో ఆరిఫ్ ఖాన్ కీలుబొమ్మ
Kerala CM : కేరళలో సీఎం పినరయి విజయన్ , గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ మధ్య రోజు రోజుకు అగాధం పెరుగుతోంది. తాజాగా నువ్వా నేనా అన్నంతగా మాటల యుద్దం కొనసాగుతోంది. తాజాగా కొత్త వివాదానికి తెర తీశారు గవర్నర్ ఖాన్. రాష్ట్రంలోని ప్రధానమైన తొమ్మిది యూనివర్శిటీలకు సంబంధించిన వైస్ ఛాన్స్ లర్స్ లను మూకుమ్మడిగా రాజీనామా చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు గవర్నర్.
అంతే కాదు డెడ్ లైన్ కూడా విధించారు. దీనిపై సీరియస్ గా స్పందించారు సీఎం విజయన్(Kerala CM) . వైస్ ఛాన్స్ లర్లకు అండగా నిలబడ్డారు సీఎం. ఏ ఒక్కరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. ఈ మేరకు గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం అంతిమ తీర్పు కోర్టు చేతిలో ఉంది. వీసీలను తొలగించే అధికారం గవర్నర్ కు లేదని స్పష్టం చేశారు సీఎం పినరయి విజయన్. ఈ సందర్భంగా సోమవారం సీఎం మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ఎస్ చేతిలో గవర్నర్ ఆరిఫ్ అహ్మద్ ఖాన్ కీలుబొమ్మగా మారారంటూ ఆరోపించారు.
గవర్నర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రాష్ట్రంలో యూనివర్శిటీల పనితీరును దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ పదవి గవర్నమెంట్ కు వ్యతిరేకంగా పని చేయడానికి కాదని రాజ్యాంగం హుందాతనాన్ని కాపాడటానికని హితవు పలికారు పినరయ్ విజయన్.
ఇదిలా ఉండగా యూజీసీ రూల్స్ కు వ్యతిరేకంగా వీసీలను నియమించారంటూ గవర్నర్ ఆరోపించారు.
Also Read : కేరళలో సీఎం..గవర్నర్ పంచాయతీ