Rishi Sunak : రిషి సునక్ కు మెజారిటీ ఎంపీల మద్దతు
179 మంది సభ్యుల సంపూర్ణ సపోర్ట్
Rishi Sunak : బ్రిటన్ ప్రధానమంత్రి రేసులో ఉన్న భారతీయ మూలాలు కలిగిన రిషి సునక్ కు ఊహించని రీతిలో మద్దతు లభించింది. ఇప్పటి వరకు మాజీ ప్రధానమంత్రి బోరీస్ జాన్సన్ తో పాటు పెన్నీ మార్డెంట్ రేసులో నిలిచారు చివరి దాకా. తాజాగా రేసు నుంచి జాన్సన్ తప్పుకున్నారు.
తాను బరి నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి విస్తు పోయేలా చేశాడు. ఇక పెన్నీ మార్డెంట్ కు ఆశించిన మేర మద్దతు లభించ లేదు. దీంతో నువ్వా నేనా అంటూ చివరి దాకా పోటీలో నిలిచిన రిషి సునక్(Rishi Sunak) కు లైన్ క్లియర్ అయ్యింది ప్రధానమంత్రి అయ్యేందుకు.
ఆయనకు నిన్నటి వరకు 143 మంది సభ్యుల మద్దతు లభించగా సోమవారం కీలకమైన సభ్యులు మరికొందరు సునక్ కు సపోర్ట్ చేయడం విశేషం. దీంతో అధికార కన్జర్వేటివ్ పార్టీలో 179 మంది సభ్యుల మద్దతు ప్రకటించడంతో దాదాపు బ్రిటన్ కు తదుపరి ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యేందుకు రిషి సునక్ కు మార్గం ఏర్పడింది.
ఇప్పటి వరకు పీఎంగా ఉన్న లిజ్ ట్రస్ తనకు పాలన చేతకాదంటూ రాజీనామా చేసింది. దీంతో రాజకీయ సంక్షోభం నెలకొంది. ప్రతిపక్షాలు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశాయి. ఈ మొత్తం వ్యవహారానికి చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగారు బోరిస్ జాన్సన్ .
చివరకు తాను పోటీలో ఉండడం లేదంటూ ప్రకటించి రిషి సునక్ కు లైన్ క్లియర్ చేశాడు. దీంతో బ్రిటన్ చరిత్రలో ఒక భారతీయుడు పీఎం పదవిపై కొలువు తీరనున్నారు.
Also Read : బ్రిటన్ ప్రధానిగా రిషి సునక్ ఎన్నిక