P Chidambaram : రిషి సునక్ ను చూసి మోదీ నేర్చుకోవాలి
కాంగ్రెస్ నేతలు చిదంబరం..జైరాం కామెంట్స్
P Chidambaram : కేంద్రంలో కొలువు తీరిన ప్రధాన మంత్రిపై నిప్పులు చెరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ప్రధాని మారాలని లేక పోతే దేశం ఇలాగే వెనక్కి వెళ్లి పోతుందని ఆవేదన వ్యక్తం చేసింది. గత కొంత కాలంగా బ్రిటన్ లో చోటు చేసుకున్న మార్పులను గుర్తించాలని సూచించారు ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పి. చిదంబరం(P Chidambaram) , జై రాం రమేష్.
దేశం ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకుంటే బెటర్ అని పేర్కొన్నారు. ఓ వైపు ద్రవ్యోల్బణం మరో వైపు నిరుద్యోగం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కానీ ప్రచారంపై ఉన్నంత శ్రద్ద దేశం పట్ల లేకుండా పోయిందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేసిన తీరు బాధాకరమని పేర్కొన్నారు.
ఇలా ఎంత కాలం ఆస్తులను అమ్ముకుంటూ దేశాన్ని పాలిస్తారంటూ ప్రశ్నించారు. ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, నేరాలకు పాల్పడిన వారిని విడుదల చేయడం మాత్రమే దేశం సాధించిన ప్రగతి అని ఎద్దేవా చేశారు. బ్రిటన్ లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు ఒక గుణ పాఠం కావాలని పేర్కొన్నారు.
వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి ప్రపంచం ఫిదా అయ్యిందని గుర్తు చేశారు. ప్రవాస భారతీయులు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తున్నారని కానీ ప్రధాన మంత్రి మోదీ మాత్రం తను ఇంకా పాలనా పరంగా దిగజారి పోతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా మారితే బెటర్ లేక పోతే దేశం మరింత సంక్షోభంలోకి వెళ్లడం ఖాయమని జోష్యం చెప్పారు కాంగ్రెస్ నాయకులు.
Also Read : రాహుల్ యాత్రతో బీజేపీలో వణుకు – జై రాం