Google CCI Fine : గూగుల్ కు రూ. 936 కోట్ల జరిమానా
వారంలో రెండోసారి సీసీఐ షాక్
Google CCI Fine : ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కు కోలుకోలేని షాక్ తగిలింది. భారత దేశానికి సంబంధించి గూగుల్ కు వారంలో ఇది రెండోసారి భారీ ఎత్తున జరిమానాకు గురి కావడం. ఏకంగా రూ. 936 కోట్లు కావడం విశేషం. యాంటీ ట్రస్ట్ విచారణ ముగిసింది. ఇందుకు సంబంధించి భారీ జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది.
పెనాల్టీ గా $113 మిలియన్ డాలర్లను జరిమానా విధించడం కలకలం రేపింది. అమెరికాకు చెందిన టెక్ దిగ్గజ సంస్థ అయిన గూగుల్ తన చెల్లింపుల యా్ , ఇన్ యాప్ చెల్లింపు వ్యవస్థను ప్రమోట్ చేసేందుకు తన మార్కెట్ స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు దోషిగా తేల్చింది.
ఆల్ఫా బెట్ ఇంక్ కు చెందిన గూగుల్ కు జరిమానా విధిస్తున్నట్లు కాంపిటీషణ్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) (Google CCI Fine) ప్రకటించింది. ఆండ్రాయిడ్ కు సంబంధించి కాంపిటీటివ్ పద్దతులకు సంబంధించి ఈ కీలక తీర్పు వెలువరించింది. ఇదిలా ఉండగా ఈ వారంలో రెండో సారి జరిమానాకు గురి కావడంపై ఇంకా స్పందించ లేదు గూగుల్ సిఇఓ సుందర్ పిచాయ్.
ఆయన ప్రవాస భారతీయుడు. తమిళనాడుకు చెందిన ఈ టెక్ దిగ్గజం గూగుల్ ఆండ్రాయిడ్ ను , క్రోమోను డెవలప్ చేశాడు. ప్రస్తుతం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా బాధ్యతలు చేపట్టారు. ఇటీవలే కేంద్రంలో కొలువు తీరిన మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది.
దేశీయ పరంగా అత్యున్నత స్థానంలో ఉండడం, ఎనలేని సేవలు అందించడం, ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించడం, సాంకేతింగా సపోర్ట్ చేసినందుకు గాను సుందర్ పిచాయ్ కి ఈ పురస్కారం దక్కింది.
Also Read : విండోస్ యూజర్లకు గూగుల్ బిగ్ షాక్