Boris Johnson : నా సంపూర్ణ మద్దతు నీకే – బోరిస్ జాన్సన్
కొత్త పీఎంకు మాజీ పీఎం కంగ్రాట్స్
Boris Johnson : భారత సంతతికి చెందిన రిషి సునక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అభినందన సందేశాలు వెల్లువలా వస్తున్నాయి. ఈ తరుణంలో నిన్నటి దాకా తన కేబినెట్ లో ఆర్థిక మంత్రి గా ఉంటూ తనపై తిరుగుబాటు జెండా ఎగుర వేశారు రిషి సునక్.
ఆపై తనతో పాటు మరొకరు రాజీనామా చేయడంలో ఎన్నిక అనివార్యమైంది. నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరి వరకు తను పీఎంగా తప్పుకునేందుకు రిషి సునక్ కారణమని లోలోపట అనుమానం వ్యక్తం చేశారు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్(Boris Johnson). ఆ మేరకు తాను తప్పుకున్నారు.
ఆపై ఎన్నికల్లో గెలవనీయకుండా అడ్డుకున్నారు. ఆపై తెర వెనుక నుండి మంత్రాంగం నడిపారు. చివరకు తను అనుకున్నది సాధించారు. తను సపోర్ట్ చేసిన లిజ్ ట్రస్ ను పీఎంగా కూర్చో బెట్టడంలో సక్సెస్ అయ్యాడు. కానీ అది కూడా మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలి పోయింది.
చివరకు ఆమె కూడా చేతులెత్తేసింది. ప్రధానమంత్రిగా కేవలం 45 రోజులు అంటే ఆరు వారాల పాటు కొనసాగింది. తనకు పాలన చేత కాదంటూ ప్రధాని పదవికి రాజీనామా ప్రకటించింది. దీంతో మళ్లీ పోటీ నెలకొంది అధికార పార్టీలో. మరోసారి తను కూడా ట్రై చేశారు బోరిస్ జాన్సన్ .
ఆయనతో పాటు రిషి సునక్ , పెన్నీ మార్డెంట్ బరిలో ఉన్నారు. కానీ ప్రధాన మంత్రి పదవికి కావాల్సిన మద్దతును కూడగట్టలేక పోయారు. దీంతో రిషి సునక్ మరోసారి తన సత్తా చూపించారు. పీఎంగా కొలువు తీరారు. ఇవాళ పదవిని అధిష్టించిన రిషి సునక్ ను ఉద్దేశించి బోరిస్ జాన్సన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సంపూర్ణ మద్దతు నీకే ఉంటుందని పేర్కొన్నారు.
Also Read : గూగుల్ కు రూ. 936 కోట్ల జరిమానా