Elon Musk : ట్విట్ట‌ర్ ఆఫీసును సంద‌ర్శించిన మస్క్ 

సింక్ ను మోసుకెళ్లిన టెస్లా సిఇఓ 

Elon Musk : ప్ర‌ముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్ట‌ర్ ను కొనుగోలు చేసే క్ర‌మంలో టెస్లా సిఇఓ , చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్(Elon Musk) సంద‌ర్శించారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను తానే స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా పంచుకున్నారు. ప్ర‌స్తుతం ఎలోన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ ఆఫీస్ సంద‌ర్శ‌న క‌ల‌క‌లం రేపుతుండ‌గా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండ‌గా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ప్ర‌ధాన కార్యాల‌యాన్ని ప్ర‌త్యేకంగా సంద‌ర్శించ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. సింక్ ను మోసుకెళ్లి ఆఫీసు హాల్స్ లో న‌డిచారు. ఎలోన్ మ‌స్క్(Elon Musk) త‌న 44 బిలియ‌న్ డాల‌ర్ల ట్విట్ట‌ర్ కొనుగోలు ఒప్పందం ముగిసే ముందు త‌న బ‌యోని చీఫ్ ట్విట్ గా మార్చుకున్నారు.

ట్విట్ట‌ర్ హెచ్ క్యూ లోకి ప్ర‌వేశిస్తున్నా. లెట్ ద‌ట్ సింక్ ఇన్ అనే క్యాప్ష‌న్ కూడా జ‌త చేశారు. ఆపై త‌న అధికారిక ఖాతాలో వీడియోను కూడా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఇదిలా ఉండ‌గా సింక్ ను మోస్తూ తాను మునిగి పోయేందుకు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు పేర్కొన్నారు ఎలోన్ మ‌స్క్.

అంత‌కు ముందు ట్విట్ట‌ర్ చీఫ్ మార్కెటింగ్ ఆఫ‌స‌ర్ లెస్లీ బెర్లాండ్ , శాన్ ఫ్రాన్సిస్కో కార్యాల‌యాన్ని సంద‌ర్శించాల‌ని యోచిస్తున్న‌ట్లు ఈమెయిల్ లో ఇప్ప‌టికే తెలియ చేశారు.

దీనిని ఒప్పందాన్ని ముగించే గ‌డువు కంటే ముందే. గ‌త ఏప్రిల్ లో మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫార‌మ్ ను కొనుగోలు చేయాలనే త‌న నిర్ణ‌యాన్ని బిలియ‌నీర్ ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుండి డీల్ ముగిసే కంటే ముందు నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి.

Also Read : ఐఫోన్ 14 ప్రో అమ్మ‌కాల‌పై మంత్రి ఆరా

Leave A Reply

Your Email Id will not be published!