Shah Faesal : పాకిస్తాన్ పై ఐఏఎస్ టాప‌ర్ ఫైస‌ల్ ఫైర్

భార‌త దేశంలో మైనార్టీలకు ర‌క్ష‌ణ

Shah Faesal : జ‌మ్మూ కాశ్మీర్ లో యూపీఎస్సీసీ టాపర్ గా నిలిచిన షా ఫైస‌ల్(Shah Faesal) షాకింగ్ కామెంట్స్ చేశారు. యునైటెడ్ కింగ్ డ‌మ్ కు భార‌తీయ సంత‌తికి చెందిన మైనార్టీ వ‌ర్గంగా పిలిచే రిషి సున‌క్ ప్ర‌ధాన‌మంత్రిగా కొలువు తీరారు.

షా ఫైస‌ల్ కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌తి ఏటా నిర్వ‌హించే యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్సీ) నిర్వ‌హించిన సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌లో జ‌మ్మూ కాశ్మీర్ రాష్ట్రం నుంచి టాప‌ర్ గా నిలిచాడు షా ఫైస‌ల్.

ఈ సంద‌ర్భంగా యూకే పీఎం రిషి సున‌క్ ను ప్ర‌త్యేకంగా అభినందించారు. టాప‌ర్ గా నిల‌వ‌డంతో షా ఫైస‌ల్ సంచ‌ల‌నంగా మారారు. దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.

ఇదే స‌మ‌యంలో పాకిస్తాన్ ప్ర‌భుత్వాన్ని, ఆ దేశ పాల‌కుల‌ను తీవ్రంగా విమ‌ర్శించారు షా ఫైస‌ల్(Shah Faesal). ట్విట్ట‌ర్ వేదిక‌గా వ‌రుస ట్వీట్ల‌తో ప్ర‌జాస్వామ్యాన్ని ప్ర‌శంసించారు.

ఇదిలా ఉండ‌గా సున‌క్ నియామ‌కం పాకిస్తాన్ కు ఆశ్చ‌ర్యం క‌లిగించడంలో ఆశ్చ‌ర్యం లేద‌న్నారు. మైనార్టీ క‌మ్యూనిటీకి చెందిన వ్య‌క్తులు అత్యున్న‌త ప‌ద‌విలో ఉండ‌లేర‌ని పేర్కొన్నారు.

కానీ భార‌త దేశంలో మైనార్టీల‌కు ఉన్న‌న్ని అవ‌కాశాలు ఇంకెక్కడా లేవ‌ని అందుకే తానే ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ అని తెలిపారు షా ఫైస‌ల్. ఈ దేశంలోని ముస్లింలు ఇస్లామిక్ దేశం అని పిలువ‌బ‌డే మరే ఇత‌ర దేశం లోనూ ఊహించ లేన‌టువంటి స్వేచ్ఛ‌ను అనుభ‌విస్తున్నార‌ని కొనియాడారు.

భార‌తీయ ప్ర‌జాస్వామ్యం ఎన్న‌డూ జాతి, మ‌త ప‌ర‌మైన మైనార్టీల‌ను మిగిలిన వారి నుండి వివక్ష చూప‌లేద‌ని పేర్కొన్నారు.

Also Read : దూరం త‌గ్గితేనే బంధం పెరుగుతుంది

Leave A Reply

Your Email Id will not be published!