Farooq Abdullah : స్పందించక పోతే హిందువులు ఉండరు
కేంద్ర సర్కార్ పై ఫరూక్ అబ్దుల్లా ఫైర్
Farooq Abdullah : జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇటీవల పదే పదే కేంద్ర సర్కార్ ను తీవ్రంగా తప్పు పడుతూ వస్తున్నారు. తాజాగా ఫరూక్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.
జమ్మూ కాశ్మీర్ లో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, రాను రాను కేంద్ర ప్రభుత్వం గనుక పట్టించుకోక పోతే హిందూయేతర రాష్ట్రంగా ఏర్పడే ప్రమాదం పొంచి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇకనైనా మోదీ ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. ఇదిలా ఉండగా త్వరలో జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు చేపట్టనుంది కేంద్రం. ఇప్పటికే ఎన్నికల జాబితాను సవరించింది కూడా. దీనిపై తీవ్ర అభ్యంతరాలు లేవనెత్తాయి విపక్షాలు. 370 ఆర్టికల్ ను రద్దు చేశాక పరిస్థితి మరింత దారుణంగా తయారైందని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) ఆరోపించారు.
ప్రధానంగా ఉగ్రవాదులు, సంస్థలు హిందువలను లక్ష్యంగా చేస్తున్నారని ఆందోళన చెందారు. ఎక్కువగా కాశ్మీరీ పండిట్లు కాల్పులకు, దాడులకు గురవుతున్నారని చెప్పారు ఫరూఖ్ అబ్దులా.
ఇప్పటికైనా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హొం శాఖ మంత్ర అమిత్ చంద్ర షా తమ ఆధిపత్య ధోరణలను పక్కన పెట్టి అసలు వాస్తవ పరిస్థితులపై ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు మాజీ సీఎం. అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు ఫరూక్ అబ్దుల్లా.
కేంద్రం కావాలనే తాత్సారం చేస్తోందని దీని వల్ల ప్రభుత్వానికే నష్టం కలుగుతుందని ఇది మంచి పద్దతి కాదని సూచించారు.
Also Read : హిందీపై తమిళనాడులో గరం గరం