Elon Musk : డబ్బుల కోసం ట్విట్టర్ కొనలేదు – ఎలాన్ మస్క్
ప్రపంచానికి శాంతి..ప్రేమను పంచాలని కొన్నా
Elon Musk : గత కొంత కాలం నుంచీ యావత్ ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తూ వస్తున్నారు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలాన్ మస్క్(Elon Musk). సామాజిక మాధ్యమాలలో టాప్ లో కొనసాగుతున్న ట్విట్టర్ ను ఆయన కొనుగోలు చేశారు ఎట్టకేలకు. మరోసారి వార్తల్లో నిలిచారు ఎలాన్ మస్క్. ఆయన ఏది చేసినా అది ఓ సంచలనమే.
మొదట ఒప్పందం చేసుకున్నారు ట్విట్టర్ తో. ఆ తర్వాత తనకు సరైన సమాచారం ఇవ్వలేదంటూ ఆరోపించారు. డీల్ క్యాన్సిల్ అన్నారు. ఆపై ట్విట్టర్ కోర్టుకు వెళ్లడంతో తను కూడా వెళ్లినా ఫాయిదా లేదని గ్రహించి చివరకు ట్విట్టర్ ను కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపాడు. ఏకంగా భారీ ఎత్తున చెల్లించేందుకు ముందుకు వచ్చాడు.
మొదటగా ట్విట్టర్ లో షేర్లను తీసుకున్నాడు. ఆపై కొనుగోలు చేసుకున్నాడు. కాగా ఎలాన్ మస్క్ కొనుగోలు వెనుక అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే తను ఎన్నికల సమయంలో సోషల్ మీడియాపై గుర్రుగా ఉన్నారు.
తనను బ్యాన్ చేయడంపై మండిపడ్డారు. అందులో ట్విట్టర్ కూడా ఒకటి. దీంతో ఎలాగైనా ట్విట్టర్ ను కొనుగోలు చేయాలని తెర వెనుక నుంచి మస్క్ కు మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇది పక్కన పెడితే ఎలాన్ మస్క్(Elon Musk) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను డబ్బుల కోసం ట్విట్టర్ ను కొనుగోలు చేయలేదంటూ స్పష్టం చేశాడు మస్క్.
ఇదే సమయంలో హెచ్చరిక కూడా చేశాడు. డబ్బు కోసం సంప్రదాయ మీడియా అనేక విపరీతాలకు ఆజ్యం పోస్తోందంటూ ఆరోపించాడు. ఆపై తాను డబ్బుల కోసం ట్విట్టర్ ను కొనుగోలు చేయలేదని కుండ బద్దలు కొట్టాడు ఎలాన్ మస్క్. ప్రపంచానికి ప్రేమను, మానవత్వాన్ని పంచేందుకు మాత్రమే తీసుకున్నానని తెలిపాడు.
Also Read : మెటా వర్స్ పై తగ్గేదే లే – జుకర్ బర్గ్