Nitish Kumar : బోటు ప్రమాదం నితీష్ ప్రచారానికి దూరం
పార్టీ శ్రేణులు ఉప ఎన్నికలో పాల్గొంటారు
Nitish Kumar : బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరం కానున్నారు. ఎందుకంటే ఆయన ఇటీవల బోటు ప్రమాదానికి గురయ్యారు. వైద్యులు సూచించిన మేరకు తాను రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని, ఆరోగ్యం కుదుట పడ్డాక తాను ప్రచారంలో పాల్గొంటానని ఇప్పటికే పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ ఉప ఎన్నిక సీఎంకు అగ్ని పరీక్ష లాంటిది. మరోవైపు తన సహచరులు ప్రచారంలో నిమగ్నం అయ్యారు. కానీ తాను మాత్రం విశ్రాంతి తీసుకుంటున్నారు. బీహార్ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాలకు సంబంధించి నవంబర్ 3న డిక్లేర్ చేసింది. తన మోటార్ బోట్ గంగపై వెంతన స్తంభాన్ని ఢీకొట్టడంతో గాయపడ్డారు సీఎం. మొకామా, గోపాల్ గంజ్ లలో బై పోల్ జరగనుంది. ఈ సందర్బంగా నితీశ్ కుమార్(Nitish Kumar) మీడియాతో మాట్లాడారు. అక్టోబర్ 15న ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. మొకామాను నిలుపు కోవాల్సి ఉంది.
ఇక గోపాల్ గంజ్ లో బీజేపీ నుండి సీటు చేజిక్కించు కోవాల్సిన అవసరం ఉందన్నారు నితీశ్ కుమార్. మరో వైపు భారతీయ జనతా పార్టీ నితీశ్ కుమార్ ను టార్గెట్ చేసింది. ఆయన మహా ఘట్ బంధన్ పట్ల అసౌకర్యంగా ఉన్నారని అందుకే ప్రచారానికి దూరంగా ఉన్నారని ఎద్దేవా చేసింది. దీనికి బోట్ ప్రమాదాన్ని ఒక సాకుగా చూపించే ప్రయత్నం తప్ప మరొకటి కాదని మండిపడింది పార్టీ.
Also Read : స్పందించక పోతే హిందువులు ఉండరు