Amit Shah : 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ఎన్ఐఏ శాఖలు
వెల్లడించిన కేంద్ర హోం శాఖ మంత్రి షా
Amit Shah : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు వచ్చే 2024 నాటికి దేశంలోని ప్రతి రాష్ట్రంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) శాఖలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. హర్యానా లోని సూరజ్ కుండ్ లో జరిగిన చింతన్ శివిర్ లో భాగంగా అమిత్ షా పాల్గొని ప్రసంగించారు.
ఉగ్రవాద కేసులను ఎదుర్కొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. దేశంలోని అంతర్గత, బాహ్య భద్రతా సమస్యల కోసం ఉమ్మడి వ్యూహాలు సిద్దం చేయాలని అమిత్ షా(Amit Shah) రాష్ట్రాలను కోరారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో నిర్ణయాత్మక విజయం సాదించేందుకు చట్ట పరమైన ఫ్రేమ్ వర్క్ బలోపేతం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి.
దీని కింద ఎన్ఐఏ, చట్ట విరుద్ద కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) ను సవరించడం ద్వారా వ్యక్తిగత ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అందులో భాగంగానే అన్ని రాష్ట్రాలలో నూతన శాఖలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు అమిత్ చంద్ర షా.
ప్రస్తుతం ఎన్ఐఏ ఢిల్లీ, హైదరాబాద్ , గౌహతి, కొచ్చి, లక్నో, ముంబై, కోల్ కతా, రాయ్ పూర్ , జమ్ము, చండీగఢ , రాంచి ,చెన్నై , ఇంఫాల్ , బెంగళూరు, పాట్నాలలో 15 శాఖలు కలిగి ఉందన్నారు. ముంబై ఉగ్ర దాడుల తర్వాత ఎన్ఐఏ ఇప్పటి వరకు 468 కేసులను నమోదు చేసిందని చెప్పారు కేంద్ర హోం శాఖ మంత్రి. మొత్తంగా దేశంలో నేరారోపణ రేటు 93.25 శాతంగా ఉందన్నారు కేంద్ర మంత్రి.
Also Read : బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఒక్కటే