Twitter CEO : సిఇఓ ప‌రాగ్ అగ‌ర్వాల్ పై మ‌స్క్ వేటు

చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్..లీగ‌ల్ హెడ్

Twitter CEO : అంతా అనుకున్న‌ట్టే జ‌రిగింది. ట్విట్ట‌ర్ ను 4,400 బిలియ‌న్ డాల‌ర్ల‌కు కొనుగోలు చేసిన టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ కొనుగోలు చేసిన వెంట‌నే కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ట్విట్ట‌ర్ సిఇఓగా ఉన్న ప్ర‌వాస భార‌తీయుడైన ప‌రాగ్ అగ‌ర్వాల్(Twitter CEO) పై చ‌ర్య తీసుకున్నారు.

ఆయ‌న‌తో పాటు చీఫ్ ఫైనాన్షియ‌ల్ ఆఫీస‌ర్, లీగ‌ల్ హెడ్ పై కూడా వేటు వేసిన‌ట్లు ప్ర‌ముఖ అమెరికా జాతీయ మీడియా సంచ‌ల‌న క‌థ‌నం ప్ర‌చురించింది. గ‌త కొంత కాలం నుంచీ ఎలాన్ మ‌స్క్ ప‌రాగ్ ప‌ట్ల ఆగ్ర‌హంతో ఉన్నారు. త‌ను కోరిన స‌మాచారాన్ని ఇవ్వ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడ‌ని మండిప‌డుతూ వ‌చ్చారు.

అక్టోబ‌ర్ 27 నుంచే పూర్తిగా ఎలాన్ మ‌స్క్ చేతిలోకి ట్విట్ట‌ర్ పూర్తిగా వెళ్లి పోయింది. ఒప్పందంలో భాగంగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు విశ్వస‌నీయ స‌మాచారం. ప‌లువురు ఉన్న‌తాధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని వాషింగ్ట‌న్ పోస్ట్ , సీఎన్బీసీ పేర్కొన్నాయి ప్ర‌త్యేకంగా.

ఇదిలా ఉండ‌గా టేకోవ‌ర్ నిబంధ‌న‌లు ఉల్లంఘించారంటూ ప‌రాగ్ అగ‌ర్వాల్(Parag Agarwal) కోర్టును ఆశ్ర‌యించిన‌ట్లు స‌మాచారం. సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్క్ ను కొనుగోలు చేసేందుకు మ‌స్క్ త‌న ఆన్ ఎగైన్ ఆఫ్ ఎగైన్ డీల్ ను సీల్ చేసేందుకు కోర్టు నియ‌మించిన గ‌డువుకు కొన్ని గంట‌ల ముందు నివేదిక‌లు బ‌య‌ట‌కు రావ‌డం విశేషం.

మ‌రో వైపు బిలియ‌నీర్ ఎలాన్ మ‌స్క్ ట్విట్ట‌ర్ హెడ్ క్వార్ట‌ర్స్ లోని కాఫీ బార్ లో సాంఘికంగా ఉన్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. మ‌రో వైపు మ‌స్క్ కోసం ప‌ని చేయ‌కూడ‌ద‌ని కొంత మంది ఉద్యోగులు ఇప్ప‌టికే ట్వి్ట్ట‌ర్ ను విడిచి పెట్టిన‌ట్లు టాక్.

Also Read : డ‌బ్బుల కోసం ట్విట్ట‌ర్ కొన‌లేదు – ఎలాన్ మ‌స్క్

Leave A Reply

Your Email Id will not be published!