S Jai Shankar : హిందీ అధికార భాష కోసం ప్రయత్నిస్తాం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్
S Jai Shankar : కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) సంచలన ప్రకటన చేశారు. ఐక్య రాజ్య సమితిలో హిందీకి అధికార భాష కోసం వచ్చేందుకు ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలని మోదీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది.
ఇప్పటికే కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సారథ్యంలోని పార్లమెంటరీ కమిటీ ఇటీవలే నివేదిక సమర్పించింది. ఆ మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నివేదించింది రిపోర్ట్ ను. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది దేశమంతటా. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ నిప్పులు చెరుగుతున్నారు.
ఒకవేళ నిర్ణయం తీసుకుంటే తమిళులు ఒప్పుకోరని హెచ్చరించారు. కేంద్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా హిందీని అమలు చేయాలన్న డిమాండ్ ను ముందుకు తీసుకు వెళుతోంది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.
తాజాగా కేంద్ర హొం శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీ భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీనిలో భాగంగా ఐక్య రాజ్య సమితిలో హిందీ భాషను(Hindi Language) అధికార భాషగా గుర్తించాలని కోరారు జై శంకర్. ఇది అమలు కావడానికి చాలా సమయం పడుతుందన్నారు.
దీనికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు జై శంకర్. హిందీ భాషను యునెస్కోలో కూడా ఉపయోగిస్తున్నారని చెప్పారు. వచ్చే ఏడాది 12న ప్రపంచ హిందీ మహాసభ నిర్వహించనున్నట్లు మంత్రి మురళీధరన్ తెలిపారు.
Also Read : చైనాపై సీరియస్ భారత్ కు సపోర్ట్ – అమెరికా