Supreme Court : పౌరసత్వ చట్టం సవరణపై కీలక తీర్పు
232 పిటిషన్లు దాఖలుపై విచారణ
Supreme Court : దేశ వ్యాప్తంగా వివాదాస్పదంగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) పై కీలకమైన తీర్పు అక్టోబర్ 31న విచారించనుంది. విచిత్రం ఏమిటంటే సీఏఏపై ఒకటి కాదు 232 పిటిషన్లు దాఖలు కావడం విశేషం. దీపావళి సెలవులు పూర్తయ్యాక దీనిపై విచారణ చేపడతామని స్పష్టం చేసింది భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానం(Supreme Court) .
సోమవారం జరిగే విచారణలో మొత్తం 240 దావాలు దాఖలు కాగా ఇందులో 232 పూర్తిగా సీఏఏకి సంబంధించినవే కావడం గమనార్హం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం కొలువు తీరాక కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే దేశం ఒకే భాష ఒకే మతం ఒకే ప్రభుత్వం ఒకే పార్టీ ఒకే సిద్దాం ఒకే పౌరసత్వం ఉండాలన్నది భారతీయ జనతా పార్టీ లక్ష్యం..దాని సిద్దాంతం కూడా అదే.
సీఏఏ అమలు చేసి తీరుతామంటూ ఇప్పటికే కుండ బద్దలు కొట్టారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. భారత దేశ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ , జస్టిస్ ఎస్. రవీంద్ర భట్ , బేల ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం కీలకంగా విచారించనుంది. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ ప్రధానమైన కేసును విచారించేందుకు శ్రీకారం చుట్టింది.
సీఏఏను సవాల్ చేస్తూ దాఖలైన వాటికి సంబంధించి విచారణ పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు సీజేఐ. ఆయన వచ్చే నెల నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు. సీఏఏపై ప్రధానంగా అభ్యంతరాలను లేవదీసింది ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ .
Also Read : ప్రజలనే కాదు ఎమ్మెల్యేలను కొంటే ఎలా