PM Modi Murmu : మహా విషాదం..దిగ్భ్రాంతికరం – మోదీ
పీఎం..ప్రెసిడెంట్..అమిత్ షా
PM Modi Murmu : గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలిన ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర విషాదం నింపింది. 150 ఏళ్ల నాటి బ్రిడ్జిపై ఛత్ పూజ కోసం 500 మంది చేరారు. ఉన్నట్టుండి కూలి పోవడంతో 132 మంది ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయారు. 177 మందిని రక్షించారు రెస్క్యూ, ఆర్మీ, నేవీ దళాలు. దీనిని మహా విషాదంగా పేర్కొన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi).
కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ప్రకటించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Murmu) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేయగా కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంతాపం తెలిపారు. కేంద్ర మంత్రులతో పాటు గవర్నర్లు, సీఎంలు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ మొత్తం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది. అధికార యంత్రాంగం సహాయక చర్యల్లో మునిగి పోయింది. బ్రిడ్జి కూలిన ఘటన చోటు చేసుకోవడంతో ప్రభుత్వ పరంగా ఇప్పటికే ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అన్నింటిని రద్దు చేసినట్లు ప్రకటించారు సీఎం
. రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి ఘటనా స్థలం వద్దనే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం చని పోయిన కుటుంబాలకు రూ. 2 లక్షలు , గాయపడిన వారికి రూ 50,000 ప్రకటించగా రాష్ట్ర ప్రభుత్వం మరణించిన కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 డిక్లేర్ చేసింది.
తీవ్రంగా గాయపడిన వారికి ఆస్పత్రిలో చికిత్సలు కొనసాగుతున్నాయి. ఇంకా రెస్క్యూ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
Also Read : 132 మందిని మింగిన వంతెన