Amit Shah : పటేల్ అఖండ భారతాన్ని సాధిస్తాం
ఆ దిశగా కృషి చేశారన్న కేంద్ర మంత్రి
Amit Shah : సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశం గర్వించదగిన నాయకుడు అని ప్రశంసలతో ముంచెత్తారు కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా. బలమైన అఖండ భారతాన్ని కల కన్నారని దానిని ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నం చేశారంటూ కితాబు ఇచ్చారు.
రాబోయే 25 ఏళ్లలో భారత దేశాన్ని బలమైన, సంపన్న దేశంగా మార్చాలనే దేశ స్వాతంత్ర సమర యోధుల కలను భారత దేశం సాకారం చేయగలదన్న నమ్మకం ఉందన్నారు కేంద్ర మంత్రి. ఉక్కు సంకల్పం కలిగిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను , అఖండ భారతాన్ని సాధించి తీరుతామని స్పష్టం చేశారు.
భారతదేశ తొలి హొం శాఖ మంత్రిగా పని చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అమిత్ షా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించారు కేంద్ర హోం శాఖ మంత్రి(Amit Shah) .
దేశాన్ని విభజించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నించినప్పటికీ సర్దార్ పటేల్ తన దూర దృష్టితో బలమైన, అఖండ భారత కలను సాకారం చేసుకున్నారని అమిత్ షా స్పష్టం చేశారు. 100వ స్వాతంత్ర వేడుకలను జరుపు కోలదన్నారు.
ముందు జాగ్రత్తగా జునాగర్ , జమ్మూ , కాశ్మీర్ , హైదరాబాద్ ను భారత యూనియన్ లోకి తీసుకు వచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ దేనని కొనియాడారు అమిత్ చంద్ర షా.
ఇదిలా ఉండగా మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం నుండి ప్రారంభమైంది రన్ ఫర్ యూనిటీ. ఇందులో క్రీడా ప్రముఖులు, క్రీడా ప్రియులు, కేంద్ర పోలీసు బలగాల సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : 132 మందిని మింగిన వంతెన