PM Modi : విషాద సమయం సంయమనం అవసరం
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిలో పీఎం
PM Modi : బాధ పడ్డాను కానీ విధి మార్గం నా ముందు మరింత బాధ్యతను గుర్తు చేస్తోందన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi). గుజరాత్ లోని మోర్బీ బ్రిడ్జి కూలి పోయిన సంఘటనలో ఇప్పటి వరకు 141 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ వంతెన అర్ధాంతరంగా కూలి పోయింది.
ఈ విషాద సమయంలో ప్రజలంతా సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తాను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు పీఎం. అన్ని వర్గాల సవాళ్లను ఎదుర్కొంటూ తన పనిని కొనసాగించిన మహోన్నతమైన నాయకుడు సర్దార్ పటేల్ అని పేర్కొన్నారు.
ఈ ఘోరమైన, విషాదకరమైన బ్రిడ్జి కూలిన వంతెన ప్రమాదంపై విచారణకు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ప్రధానమంత్రి చెప్పారు. రెస్క్యూ టీం అక్కడే కొనసాగుతోందని అన్నారు మోదీ(PM Modi). కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందజేస్తుందని స్పష్టం చేశారు.
నేను ఏక్తా నగర్ లో ఉన్నాను. కానీ నా మనస్సు మోర్బీ బాధితులతో ఉందన్నారు. అరుదుగా నా జీవితంలో ఇలాంటి బాధను ఎన్నో రకాలుగా అనుభవించానని అన్నారు ప్రధానమంత్రి. ఒక వైపు నొప్పితో నిండిన హృదయం ఉంది. మరో వైపు విధి నన్ను బాధ్యతలను గుర్తు చేస్తోందన్నారు.
ఇదిలా ఉండగా కేంద్ర మాజీ హోం మంత్రి, దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ 147వ జయంతుత్సాలను పురస్కరించుకుని ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Also Read : మహా విషాదం..దిగ్భ్రాంతికరం – మోదీ