Twitter Blue Tick : బ్లూ టిక్ పొందాలంటే $20 చెల్లించాలా
ట్విట్టర్ యూజర్లకు మస్క్ బిగ్ షాక్
Twitter Blue Tick : టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలాన్ మస్క్ రోజు రోజుకు షాక్ ల మీదకే షాక్ లు ఇస్తున్నారు. రూ. 4,400 కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు. టేకోవర్ చేసుకున్న వెంటనే ట్విట్టర్ లో టాప్ పొజిషన్ లో ఉన్న వారందరినీ సాగనంపాడు.
వారిలో కీలకంగా ఉన్న చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ సెగెల్ , లీగల్ హెడ్ విజయా గద్దె లపై చర్యలు తీసుకున్నారు.
ఆ తర్వాత 70 శాతానికి పైగా మిగతా ఉద్యోగులకు మంగళం పాడేందుకు రెడీ అయ్యారు ఎలాన్ మస్క్. ఈ ప్రాజెక్టులో పని చేస్తున్న ట్విట్టర్ ఉద్యోగులు కొత్త ఫీచర్ ప్రారంభించేందుకు నవంబర్ 7 లోపు గడువు ఇచ్చారు. లేక పోతే తొలగించేందుకు సిద్దంగా ఉండాలని హెచ్చరించారు.
భారీ కొనుగోలు చేసిన ట్విట్టర్ చేశాక పెను మార్పులకు శ్రీకరాం చుట్టారు ఎలాన్ మస్క్. ట్విట్టర్ వర్డ్ పరిమితిని పెంచుతున్నట్లు వచ్చిన నివేదికల తర్వాత ట్విట్టర్ ఖాతాలకు చెల్లింపు ధ్రవీకరణ ఫీచర్ ను పరిచయం చేయడంపై సూచన చేసినట్లు భావిస్తున్నారు.
చెల్లింపు ధ్రవీకరణను ప్రవేశ పెట్టడానికి లేదా సంస్థ నుండి నిష్క్రమించమని మస్క్ తన ఉద్యోగులను కోరినట్లు తాజాగా అందిన విశ్వసనీయమైన సమాచారం.
ట్విట్టర్ బ్లూ అనేది సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్. ఇది అదనపు ఫీచర్లను అన్ లాక్ చేస్తుంది. ఈ చర్య వినియోగదారులను ధ్రవీకరిస్తుంది. ట్విట్టర్ బ్లూ టిక్ కోసం $19.99 వసూలు చేయాలని(Twitter Blue Tick) యోచిస్తోంది.
మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ట్విట్టర్ ఉద్యోగులకు ఆగ్రహం తెప్పించేలా చేస్తున్నాయి.
Also Read : గౌతమ్ అదానీ భారీగా పెట్టుబడులు