Anurag Thakur : లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కింగ్ పిన్
నిప్పులు చెరిగిన అనురాగ్ ఠాకూర్
Anurag Thakur : కేంద్ర సమాచార, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్(Anurag Thakur) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అసలైన కింగ్ పిన్ ఎవరో కాదని ఆయనే ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అంటూ మండిపడ్డారు. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయని 15 మందిపై అభియోగాలు మోపిందన్నారు.
కానీ రోజు రోజుకు తానేదో పవిత్రమైన వ్యక్తినంటూ చెల్లుబాటు కానీ, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుతున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రతి ఎన్నికల సమయంలో మాయ మాటలు చెప్పడం ఆ తర్వాత మరిచి పోవడం కేజ్రీవాల్ కు అలవాటుగా మారిందన్నారు. ఆయన తలకిందులు చేసి తపస్సు చేసినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు.
ఇప్పటికే ఆయన సపోర్ట్ తోనే మనీష్ సిసోడియా లాంటి వాళ్లు అక్రమాలకు పాల్పడ్డారని లేక పోతే ఎందుకు కేసులు నమోదు చేస్తాయంటూ ప్రశ్నించారు అనురాగ్ ఠాగూర్. పంజాబ్ లోని మొహాలీలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
పంజాబ్ లో ఆప్ ఏం చేస్తోందంటూ ప్రశ్నించారు. ఢిల్లీలో పాలన పడకేసిందన్నారు. వచ్చే నెలలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లలో భారతీయ జనతా పార్టీ తిరిగి పవర్ లోకి రావడం ఖాయమన్నారు. కమీషన్, కరప్షన్ కు కేరాఫ్ గా మారాయంటూ ధ్వజమెత్తారు అనురాగ్ ఠాకూర్(Anurag Thakur).
మనీ లాండరింగ్ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి సత్యేందర్ జైన్ బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారని వీళ్లా తమకు పాఠాలు నేర్పేది అంటూ నిప్పులు చెరిగారు.
Also Read : ‘ఇందిర’ దేశం మరువని ధీర వనిత