Morbi Bridge Collapse : గుజ‌రాత్ విషాదంపై సంతాపాల వెల్లువ‌

మ‌మ‌తా బెన‌ర్జీ..కేజ్రీవాల్..సోనియా..రాహుల్

Morbi Bridge Collapse : గుజ‌రాత్ లోని మోర్బీ వంతెన కూలి పోయిన ఘ‌ట‌న‌లో(Morbi Bridge Collapse) ఇప్ప‌టి వ‌ర‌కు 141 మందికి పైగా మ‌ర‌ణించారు. మ‌రికొంద‌రు చ‌ని పోయే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 171 మందిని ర‌క్షించారు. రెస్క్యూ, ఆర్మీ, నేవీ ద‌ళాలు రంగంలో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టాయి. భార‌త దేశ ప్ర‌ధాన మంత్రి ఘ‌ట‌న‌కు సంబంధించి విచార‌ణ‌కు ఆదేశించారు.

ఈ ఘ‌ట‌న‌ను మ‌హా విషాదంగా పేర్కొన్నారు. ఈ త‌రుణంలో గుజ‌రాత్ రాష్ట్రంలో ప్ర‌భుత్వం త‌న అధికారిక కార్య‌క్ర‌మాల‌ను అన్నింటిని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఇదిలా ఉండ‌గా దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు చెందిన సీఎంలు, గ‌వ‌ర్న‌ర్లు, ఎల్జీలు తీవ్ర సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయ‌కురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ చీఫ్ ఖ‌ర్గే స్పందించారు.

ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. ఆప్ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్, టీఎంసీ చీఫ్‌, ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్, హ‌ర్యానా సీఎం ఖ‌ట్ట‌ర్ , యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, పంజాబ్ సీఎం భ‌గ‌వంత్ మాన్ తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రులు సంతాపం వ్య‌క్తం చేశారు.

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల‌కు ప్ర‌గాఢ సానుభూతిని తెలియ చేశారు. గాయ‌ప‌డిన వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు స‌హాయ‌క చ‌ర్య‌ల‌లో పాల్గొనాల‌ని సూచించారు రాహుల్ గాంధీ.

Also Read : 150 మందిని మింగిన వంతెన

Leave A Reply

Your Email Id will not be published!