Ponguru Narayana : మాజీ మంత్రి నారాయణ బెయిల్ రద్దు
నవంబర్ 30 లోగా లొంగి పోవాలని ఆదేశం
Ponguru Narayana : మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల చైర్మన్ నారాయణకు(Ponguru Narayana) కోలుకోలేని షాక్ తగిలింది. తనకు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. నవంబర్ 30 లోగా గడువు ఇచ్చింది. అంత లోపు స్వచ్చందంగా లొంగి పోవాలని ఆదేశించింది. లేక పోతే కఠిన చర్యలకు ఆదేశించాల్సి వస్తుందని కోర్టు హెచ్చరించింది.
ఇదిలా ఉండగా నారాయణ విద్యా సంస్థలపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో చిన్నగా మొదలైన ఈయన గారి వ్యాపారం భారీ ఎత్తున రాష్ట్రాలను దాటి దేశమంతటా విస్తరించింది. ఒకే కాలేజీ, స్కూల్ కు పర్మిషన్ తీసుకోవడం ఆ తర్వాత వాటిని అదే పేరుతో నిర్వహించడం కంటిన్యూ కొనసాగుతోంది.
తెలంగాణలో పూర్తిగా నిస్సిగ్గుగా వసూళ్లకు దిగారు. కొంత మంది విద్యార్థులు టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన దాఖలాలు కోకొల్లలు. ఇదిలా ఉండగా ఆంధ్ర ప్రదేశ్ లో 10వ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో విచారణ చేపట్టిన కోర్టు నారాయణకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. చిత్తూరు కోర్టు సోమవారం కీలక ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపింది.
ఇదే ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన నారాయణకు గతంలో ఇదే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా విచారణకు సహకరించకుండా తప్పించుకు తిరుగుతున్నాడని , పెద్ద ఎత్తున పై స్థాయిలో ఒత్తిళ్లు తీసుకు వస్తున్నాడని ఆరోపిస్తూ చిత్తూరు కోర్టులో అడిషనల్ అడ్వకేట్ జనరల్ దావా దాఖలు చేశారు.
వాదనలు విన్న కోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ మేరకు నవంబర్ 30 లోగా లొంగి పోవాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
Also Read : టీఆర్ఎస్ తో పొత్తు ప్రసక్తే లేదు – రాహుల్